Indian 2 trailer : కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ ట్రైలర్.. అవీనితిని నిర్మూలించేందుకు తిరిగొచ్చిన సేనాపతి
లోకనాయకుడు కమల్‌హాసన్ నటిస్తున్న చిత్రం ‘ఇండియన్-2( భారతీయుడు2).

Indian 2 trailer
Indian 2 trailer : లోకనాయకుడు కమల్‌హాసన్ నటిస్తున్న చిత్రం ‘ఇండియన్-2( భారతీయుడు2). శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. 1996లో వచ్చిన ఇండియన్ సినిమాకి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తుండగా.. సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్.జె.సూర్య, బాబీ సింహ.. ఇలా ఎంతో మంది స్టార్స్ నటిస్తున్నారు.
తమిళ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్, రెడ్ జైంట్ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కాగా.. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ జూలై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడడంతో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఇందులో భాగంగా తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.
Shanmukha : ఆది సాయికుమార్ ‘షణ్ముఖ’ మూవీ అప్‌డేట్ ఇదే..
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు వీరశేఖరన్ సేనాపతి పాత్రలో కమల్ హాసన్ కనిపించాడు. మొదటి భాగం చివరల్లో ఆయన దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాడు. దేశంలో అవినీతిని నియంత్రించడంలో తన సాయం అవసరం అయినప్పుడు తిరిగి వస్తానని వాగ్దానం చేయగా దాన్ని నిలబెట్టుకునేందుకు మళ్లీ వచ్చాడు. ట్రైలర్‌లో కమల్‌హాసన్ నటన అదుర్స్ అనిపించేలా ఉంది. ఆయన చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.