Kamal Kamaraju: ‘సోదర సోదరీమణులారా..’ అంటున్న గోదావరి హీరో!

టాలీవుడ్‌లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు కమల్ కామరాజు. ఆయన నటించిన సినిమాల్లో చాలా వరకు మంచి ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో కనిపించాడు. ఇక కమల్ కామరాజు ప్రస్తుతం లీడ్ రోల్‌లో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, ఈ సినిమా గురించి ఆరా తీస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

Kamal Kamaraju: ‘సోదర సోదరీమణులారా..’ అంటున్న గోదావరి హీరో!

Kamal Kamaraju New Movie Titled Sodara Sodarimanulara

Updated On : January 26, 2023 / 8:15 PM IST

Kamal Kamaraju: టాలీవుడ్‌లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు కమల్ కామరాజు. ఆయన నటించిన సినిమాల్లో చాలా వరకు మంచి ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో కనిపించాడు. ఇక కమల్ కామరాజు ప్రస్తుతం లీడ్ రోల్‌లో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, ఈ సినిమా గురించి ఆరా తీస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఈ సినిమాకు ‘‘సోదర సోదరీమణులారా..’’ అనే టైటిల్ ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ట్యాగ్ లైన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కమల్ కామరాజు, అపర్ణాదేవి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రియలిస్టిక్ డ్రామాగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను రఘుపతి రెడ్డి డైరెక్ట్ చేస్తుండగా, 9 EM ఎంటర్టైన్మెంట్స్, IR మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

ఈ సినిమాతో కమల్ కామరాజు మరోసారి మంచి విజయాన్ని అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా, ఈ సినిమాకు మదీన్ ఎస్.కె సంగీతం అందిస్తుండగా, వేసవి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి ఈ సినిమాతో కమల్ కామరాజు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.