కాంచన-3: భయపెట్టలేక పోయింది
కాంచన- 3 రివ్యూ..

కాంచన- 3 రివ్యూ..
ముని సినిమాతో హార్రర్ కామెడీ జానర్‌తో భారీ హిట్ కొట్టిన రాఘవ లారెన్స్.. ఇదే సిరీస్‌ని కంటిన్యూ చేస్తూ.. కాంచన, గంగ సినిమాలతో కూడా భారీ హిట్స్‌ని దక్కించుకున్నాడు. నటుడిగా, డైరెక్టర్‌గా తనకు విజయాలు అందిస్తున్న ఇదే సిరీస్‌ను కొనసాగిస్తూ.. ప్రొడ్యూసర్‌గా కూడా మారి కాంచన 3 ని తెరకెక్కించాడు. గత సినిమాల మాదిరిగా కాంచన 3 కూడా భయపెడుతూ, నవ్విస్తూ, హిట్ అందుకుందా .. లేక లారెన్స్‌కి షాకిచ్చిందా అనేది ఇప్పుడు చూద్దాం.
కథ విషయానికొస్తే తన అమ్మమ్మ , తాతయ్యల షష్టిపూర్తి కోసం కుటుంబ సమేతంగా వరంగల్‌లోని తాతయ్య వాళ్లింటికొస్తాడు రాఘవ. అయితే అలావస్తున్న క్రమంలో అనుకోకుండా రెండు దెయ్యాలను వెంటపెట్టుకుని వస్తాడు. దాంతో ఆ ఇంట్లో రకరకాల భయంకర సంఘటనలు జరుగుతుంటాయి. భయపడిన వాళ్లింట్లో వాళ్లంతా కలిసి మునీశ్వర స్వామి గుళ్లోని అఘోరా దగ్గర కెళతారు. ఆ ఇంట్లో ఉన్న, రాఘవ ఒంట్లో ఉన్న కాళి, రోజీ అనే రెండు ప్రేతాత్మల గురించి చెప్తాడు. అసలు ఆ కాళి, రోజీలు ఎవరు..? ఎందుకు వారు ప్రేతాత్మలుగా మారారు? రాఘవని ఆవహించి ఎలా వాళ్లు పగతీర్చుకున్నారు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే..
నటీనటుల విషయానికొస్తే లారెన్స్‌కు నటుడిగా బాగా గుర్తింపు తీసుకొచ్చింది కాంచన సిరీస్. భయపెడుతూ, నవ్విస్తూ.. మెల్లమెల్లగా తనలో ఉన్న అందరికీ అలవాటు చేసిన లారెన్స్, ఈ సినిమాలో కూడా సేమ్ ఫార్ములానే ఫాలో అయ్యాడు. అయితే మాస్ టచప్ కోసం ఈ సారి ఏకంగా 3 హీరోయిన్లను పెట్టాడు. అయితే వాళ్లకు పేరుకు చెప్పుకునే పాత్రలు తప్ప, పేరు తెచ్చే పాత్రలు దక్కలేదు. లారెన్స్ కూడా గత సినిమాల్లానే నార్మల్గా చేస్తూ వెళ్ళిపోయాడు. ఇక కోవై సరళ, దేవదర్శిని, సీమ, ఇంతకు ముందు కాంచన సిరీస్ సినిమాల్లో లాగానే కనిపించారు కానీ.. కొత్తదనం చూపించలేదు. మిగతా వాళ్లందరూ పాత్రల పరిధి మేరకు నటించారు. కానీ కొంతమంది నటన మాత్రం ఓవర్ యాక్షన్ అనిపించింది.
టెక్నీషియన్స్ విషయానికొస్తే ఈ సినిమాకి రచయిత, నిర్మాత, దర్శకుడు అయిన రాఘవ లారెన్స్ ఈ సిరీస్‌లో వచ్చిన 3 సినిమాల కన్నా ఈ సినిమా భారీ విజయం సాధించాలని కథలో అనేక ఎలిమెంట్స్‌ను పెట్టి.. దేనికీ న్యాయం చెయ్యలేకపోయాడు. దానికి తగ్గట్టు స్క్రీన్ ప్లే కూడా.. అస్తవ్యస్తంగా, గందరగోళంగా తయారైంది. ఇక పాటలైతే.. స్పీడ్ బ్రేకర్లలా.. సినిమా ఫ్లో కి దారుణంగా అడ్డం పడ్డాయి.ఈ విధంగా రాఘవ లారెన్స్ డైరెక్టర్‌గా పూర్తిగా తడబడ్డాడు. థమన్ పాటలు రొటీన్‌గా ఉన్నా ఆర్.ఆర్. మాత్రం పరవాలేదనిపించి.. హారర్ సన్నివేశాలు ఎలివేట్ అవ్వడానికి ఉపయోగపడింది. సర్వేష్ మురారి , వెట్రిపళని స్వామి ల సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపించింది. గ్రాఫిక్స్ మాత్రం నాసిరకంగా ఉన్నాయి. నిర్మాణ విలువలు ఓ మోస్తరుగా ఉన్నాయి.
ఓవరాల్‌గా చెప్పాలంటే సెన్సేషనల్ హిట్ సిరీస్ అయిన కాంచన బ్రాండ్ నేమ్‌తో తెరకెక్కించిన కాంచన 3 కథ, కథనాల విషయంలో పూర్తిగి నిరాశ పరచింది. ఊరమాస్ కామెడీ మరికొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయితే బి,సి సెంటర్స్‌లో ఓ మోస్తరు కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది.
ప్లస్ పాయింట్స్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
కొన్ని హారర్ సీన్స్
మైనస్ పాయిట్స్
అస్తవ్యస్తమైన కథ
స్క్రీన్ ప్లే
వర్కవుట్ కాని కామెడీ