Kangana Ranaut : రామ్ చరణ్‌కి పెద్ద అభిమానిని అంటున్న కంగనా.. తన సినిమాలు అంటే..
చంద్రముఖి 2 ప్రమోషన్స్ లో ఉన్న కంగనా రనౌత్... రామ్ చరణ్‌కి తను పెద్ద అభిమానిని అంటూ చెప్పుకొచ్చింది.

Kangana Ranaut comments on Ram Charan at Chandramukhi 2 promotions
Kangana Ranaut : బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. ప్రస్తుతం చంద్రముఖి 2 (Chandramukhi 2) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 28న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కి సిద్దమవుతుంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటూ కంగనా సందడి చేస్తుంది. ఈక్రమంలోనే తెలుగు ఛానల్స్ కి కూడా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రామ్ చరణ్ (Ram Charan) గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
టాలీవుడ్ లో ఒక సినిమా చేయాలంటే మీరు ఎవరితో కలిసి నటిస్తారు..? మీకిష్టమైన హీరో ఎవరు..? అని ప్రశ్నించారు. దీనికి కంగనా బదులిస్తూ.. తను రామ్ చరణ్ కి పెద్ద అభిమానిని అంటూ చెప్పుకొచ్చింది. చరణ్ సినిమాలు అంటే తనకి ఎంతో ఇష్టమని వెల్లడించింది. అలాగే అల్లు అర్జున్ అంటే కూడా ఇష్టమని పేర్కొంది. సమంతతో కూడా కలిసి నటించాలని ఉంది అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఆల్రెడీ కంగనా.. ‘ఏక్ నిరంజన్’ సినిమాలో ప్రభాస్ తో కలిసి నటించింది. మరోసారి ప్రభాస్ తో కలిసి నటించాలని ఉందంటూ పేర్కొంది.
అలాగే మరో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రామ్ చరణ్, రాజమౌళితో కలిసి సినిమా చేయాలని ఉందంటూ చెప్పుకొచ్చింది. ఇక కంగనా కామెంట్స్ చరణ్ అభిమానులు నెట్టింట వైరల్ చేస్తూ హల్ చల్ చేస్తున్నారు. ఇక చంద్రముఖి 2 విషయానికి వస్తే.. ఈ సినిమాలో రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్నాడు. చంద్రముఖి 1ని తెరకెక్కించిన దర్శకుడు పి.వాసు ఈ మూవీని కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ చంద్రముఖి.. మొదటి చంద్రముఖిలా మెప్పిస్తుందా..? లేదా..? చూడాలి.