Dhaakad Teaser: స్పై థ్రిల్లర్‌లో కంగనా ఉగ్రరూపం.. వన్ ఉమెన్ షో!

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఈ మధ్య లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో బాలీవుడ్ యాక్షన్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని విధంగా పోటీ ఇస్తున్న సంగతి తెలిసిందే. మాణికర్ణికా లాంటి సాహస సినిమాలతో..

Dhaakad Teaser: స్పై థ్రిల్లర్‌లో కంగనా ఉగ్రరూపం.. వన్ ఉమెన్ షో!

Dhaakad

Updated On : April 12, 2022 / 9:01 PM IST

Dhaakad Teaser: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఈ మధ్య లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో బాలీవుడ్ యాక్షన్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని విధంగా పోటీ ఇస్తున్న సంగతి తెలిసిందే. మాణికర్ణికా లాంటి సాహస సినిమాలతో పాటు తలైవి లాంటి బయోపిక్ సినిమాలలో అదరగొట్టిన కంగనా ఇప్పుడు ప్రధాన పాత్రలో రజ్నీష్ ఘాయ్ గహై దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ `ధాకడ్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే కంగన మరో అద్భుతం చేయబోతుందని అంచనాలు మొదయ్యాయి.

Kangana Ranaut: బాలీవుడ్‌పై అక్కసు.. కంగనా శ్రీరంగనీతులు!

భారీ యాక్షన్ అడ్వెంచర్స్ సినిమాలో ప్రధాన అస్సెట్ గా నిలుస్తాయని ఆ మధ్య కంగన ఓ ఇంటర్వ్యూలో హింట్ ఇవ్వడంతో సినిమాపై అంకంతకు అంచనాలు పెరిగిపోయాయి. ఆ అంచనాలు అలా ఉండగానే తాజాగా మేకర్స్ చిత్ర టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో ఒళ్లు గగుర్పొడిచే సాహస విన్యాసాలతో కంగనా రనౌత్ అదిరిపోయే విజువల్ ట్రీట్ ఇచ్చింది. ఒక నిమిషం 21 సెకన్లు నిడివి ఉన్న టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా కట్ చేశారు.

Kangana Ranuat : సౌత్ స్టార్లపై కంగనా కామెంట్స్.. వాళ్ళు మిమ్మల్ని నాశనం చేస్తారు..

స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ధాకడ్ టీజర్ లో ప్రతి సన్నివేశం రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. టీజర్ మొదలు నుంచి ముగింపు వరకూ యాక్షన్ సన్నివేశాలే హైలైట్ గా ఉన్నాయి. ప్రత్యర్ధులపై విరుచుకుపడుతూ కంగన బుల్లెట్లు మోత.. కంగన కత్తి పోట్లు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. బాలీవుడ్ యాక్షన్ స్టార్ కి ఏమాత్రం తీసిపోకుండా కంగనా చించేస్తే.. సినిమా హోలీవుడ్ స్థాయి యాక్షన్ సినిమాలా ఉంటుందేమో అనేలా సన్నివేశాలు హైలెట్ అయ్యాయి. మరి టీజర్ ఇలా ఉంటే ఇక ట్రైలర్, సినిమా ఏ స్థాయిలో ఉంటాయో చూడాలి.