బాలీవుడ్‌లో కొకైన్ అంత ఫేమస్సా?

అటు తిరిగి.. ఇటు తిరిగి.. సుశాంత్ కేసు కూడా చివరికి డ్రగ్స్ దగ్గరే వచ్చి ఆగింది. దీనిపై కంగనా రనౌత్ చేస్తున్న ట్వీట్స్.. మరింత ఫైర్ పుట్టిస్తున్నాయ్. ఫిల్స్ ఇండస్ట్రీ అంటేనే.. డ్రగ్స్‌కి కేరాఫ్‌గా మారిపోయింది. డ్రగ్స్ ఇష్యూ ఎక్కడ మొదలైనా.. చివరికి అది చిత్ర పరిశ్రమ దగ్గరే ఆగిపోతోంది.
ఇన్నాళ్లూ గుట్టుగా సాగిన బాలీవుడ్ డ్రగ్స్ డోస్.. ఇప్పుడు సుశాంత్ మిస్టరీ డెత్ కేసు, కంగనా ట్వీట్స్‌తో.. బజారుకొచ్చిపడింది. అసలేం జరుగుతోంది ఫిల్మ్ ఇండస్ట్రీలో.? బీ టౌన్‌లో డ్రగ్స్ లెక్కేంటి?
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డెత్ మిస్టరీలో బయటపడుతున్న విషయాలు సంచలనాలు రేకెత్తిస్తుంటే.. మరో వైపు డ్రగ్ మాఫియాతో లింకులు బాలీవుడ్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయ్. డ్రగ్ డీలర్‌తో రియా చక్రవర్తి వాట్సాప్ చాటింగ్ బయటకురావడంతో.. బీ టౌన్ డ్రగ్ లింకులు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
ఇక.. బీ టౌన్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. కొన్నాళ్లుగా బాలీవుడ్ మాఫియాని చెడుగుడు ఆడేస్తోంది. సుశాంత్ మరణం తర్వాత.. కంగనా డోస్ మరింత పెంచింది. ఇండస్ట్రీ ఏ-లిస్టర్స్ అంటూ ఓ సెక్షన్‌ని ఏకిపారేస్తోంది. ఇన్నాళ్లూ.. ఇండస్ట్రీలో గుట్టుగా సాగిపోయే డ్రగ్ పార్టీల భాగోతాన్ని.. ఈ సిల్వర్ స్క్రీన్ క్వీన్.. బయటపెట్టేస్తోంది.తన ట్వీట్స్‌తో.. అంతా విస్తుపోయే నిజాలు బయట పెట్టేస్తోంది. బాలీవుడ్ పార్టీల్లో కిక్కు వెనకున్న సీక్రెట్‌ని.. బయటపెట్టేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
బాలీవుడ్ మందు పార్టీల్లో.. ఎక్కువగా వాడే డ్రగ్ ఏది అన్న ప్రశ్నకు.. బీ టౌన్ పార్టీల్లో.. కొకైన్ డ్రగ్ చాలా ఫేవరెట్ అంటూ అనౌన్స్ చేసి ఫుల్ హీట్ పెంచేసింది కంగనా రనౌత్. చాలా మంది సెలబ్రిటీలు, హీరోలు కొకైన్ కిక్కులో జోగేందుకు.. బాగా ఇంట్రస్ట్ చూపిస్తారట. పార్టీకి వెళ్లిన వాళ్లంతా.. ఈ డ్రగ్‌ని ఫ్రీగా తీసుకుంటారట.
అంతేకాదు.. బీ టౌన్ సెలబ్రిటీల పార్టీల్లో.. డ్రగ్స్ ఒక స్టేటస్ సింబల్. అందుకే.. చాలా మంది మత్తులో జోగుతూ.. పార్టీని ఎంజాయ్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తారట. అందుకే.. గెస్ట్‌లకు కొకైన్‌ని సప్లై చేస్తారని తెలుస్తోంది. పార్టీలే కాదు.. క్యాజువల్‌గా కలిసినా డోస్ పడాల్సిందేనట. ఇదంతా.. సెపరేట్ బ్యాచ్ అంటున్నారు.
కంగనా ట్వీట్లతో బీ టౌన్‌లో రగడ :
బాలీవుడ్ పార్టీల్లో.. డ్రగ్స్ వ్యవహారం ఇన్నాళ్లూ అనధికారికంగా తెలిసిందే అయినా.. ఎవరూ బయటపెట్టలేదు. గుట్టుగా పనికానిచ్చేశారు. కానీ.. సుశాంత్ మృతితో.. కంగనా ఈ విషయాలన్నీ ట్విట్టర్ ద్వారా బయటపెట్టేసింది. దీంతో.. బీ టౌన్‌లో నిప్పు రాజుకుంది. సుశాంత్ వంట మనిషి నీరజ్ కూడా.. పోలీసులకు డ్రగ్స్ వాడకంపై సమాచారం ఇచ్చాడట. ఆ ఇన్ఫర్మేషన్‌తోనే.. పోలీసులు బీ టౌన్‌లో డ్రగ్స్ డొంకను కదిలించే ప్రయత్నం చేస్తున్నారు.
బాలీవుడ్‌లో దాదాపు 20 మంది హీరో, హీరోయిన్లకు.. డ్రగ్స్ లింకులు ఉన్నాయన్న సమాచారం ఇప్పుడు ఇండస్ట్రీలో టెంపరేచర్ పెంచుతోంది. వీరిలో.. స్టార్ యాక్టర్స్ కూడా ఉన్నారని అధికారిక వర్గాలు అనుమాని స్తున్నాయ్. అంతేకాదు.. సుశాంత్ మరణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు రాజకీయ నేతలతో పాటు మరికొందరికి కూడా లింకులున్నాయనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
రియాకు డ్రగ్స్ లింకులున్నాయంటూ :
రియాకు డ్రగ్స్ లింకులున్నట్లు కథనాలు రావడంతో.. సుశాంత్ సిస్టర్ శ్వేతా సింగ్ ట్విట్టర్‌లో స్పందించింది. ఇది నేరపూరితమైన చర్య అని.. సీబీఐ తక్షణమే రియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇటీవల.. ప్రొడ్యూసర్ సందీప్ సింగ్ దుబాయ్ లింకులపై కూడా చాలా అనుమానాలు వ్యక్తమయ్యాయ్. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి కూడా బాలీవుడ్‌లో డ్రగ్స్ లింకులపై అనుమానం వ్యక్తం చేశారు.
ఓవరాల్‌గా చూసుకుంటే.. సుశాంత్ డెత్ కేసులో.. ఇప్పుడు డ్రగ్స్ ఎపిసోడ్ నడుస్తోంది. ఈ మిస్టీరియస్ కేసులోనూ.. లేటెస్ట్‌గా బయటకొచ్చిన డ్రగ్స్ ఇష్యూలోనూ రియా చక్రవర్తే ప్రధాన నిందితురాలిగా ఉంది. దీనికి.. ఇండస్ట్రీలోని కంగనా రనౌత్ కూడా మరింత ఆజ్యం పోస్తోంది. సుశాంత్‌కు డ్రగ్స్‌కు సంబంధించిన డర్టీ సీక్రెట్స్ తెలియడం వల్లే.. అతను చనిపోయాడంటూ ట్వీట్ పేల్చింది. అంతే.. బాలీవుడ్ డ్రగ్ లింక్స్.. ఇప్పుడు ఇండియా మొత్తం హాట్ టాపిక్‌గా మారింది.
If narcotics Control Bureau enters Bullywood, many A listers will be behind bars, if blood tests are conducted many shocking revelations will happen. Hope @PMOIndia under swatchh Bharat mission cleanses the gutter called Bullywood.
— Kangana Ranaut (@KanganaTeam) August 26, 2020