చేతనైంది చేసుకో-క్రిష్‌పై కంగనా ఫైర్

క్రిష్‌తో పాటు, తనపై కామెంట్స్ చేసిన మిస్తీ చక్రవర్తి, రచయిత అపూర్వ అస్రానీలపై విరుచుకుపడిన కంగనా రనౌత్.

  • Published By: sekhar ,Published On : February 2, 2019 / 09:24 AM IST
చేతనైంది చేసుకో-క్రిష్‌పై కంగనా ఫైర్

Updated On : February 2, 2019 / 9:24 AM IST

క్రిష్‌తో పాటు, తనపై కామెంట్స్ చేసిన మిస్తీ చక్రవర్తి, రచయిత అపూర్వ అస్రానీలపై విరుచుకుపడిన కంగనా రనౌత్.

మణికర్ణిక సినిమా విషయంలో నటి కంగనా రనౌత్, దర్శకుడు క్రిష్‌ల మధ్య వార్ నడుస్తుంది. క్రిష్, మణికర్ణిక సినిమాను దాదాపు 70 శాతం  నేనే పూర్తిచేసానంటున్నాడు. కంగనా ఏమో తూచ్, సినిమా మొత్తం నేనే తీసాను అంటుంది. సినిమా నిర్మాత కమల్ జైన్ కూడా కంగనాకే సపోర్ట్‌గా మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న కంగనా, రీసెంట్‌గా క్రిష్ మాటలపై రెస్పాండ్ అయ్యింది. ఫారిన్ నుండి వస్తూ, ముంబై ఎయిర్ పోర్ట్‌లో మీడియాతో మాట్లాడింది కంగనా. క్రిష్‌తో పాటు, తనపై కామెంట్స్ చేసిన మిస్తీ చక్రవర్తి, రచయిత అపూర్వ అస్రానీలపై విరుచుకుపడింది. మణికర్ణిక సినిమాని నేనే డైరెక్ట్ చేసాను. క్రిష్, తనే డైరెక్ట్ చేసానంటున్నాడు కాబట్టి, ప్రూవ్ చేసుకోమనండి.. మీడియాలో నోరు పారేసుకున్నంత మాత్రాన ఒరిగేదేం ఉండదు.

నా క్యారెక్టర్ తీసేసారు, నా పాత్ర నిడివి తగ్గించేసారు అంటున్నవాళ్ళ గురించి ఐ డోన్ట్ కేర్… నేనేంటో నాకు తెలుసు.. నా టాలెంట్‌తో ఇప్పటి వరకు 3 నేషనల్ అవార్డ్స్ అందుకున్నాను. మీకు చేతనైతే, నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళంతా కలిసి, ఒక మంచి సినిమా తీసి నాకు గుణపాఠం నేర్పించండి అని సవాలు విసిరింది కంగనా రనౌత్.. కంగనా, నిర్మాత కమల్ జైన్ కామెంట్స్‌పై, క్రిష్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.