Kangana Ranaut : చంద్రముఖి 2లో ఆమెని మ్యాచ్ చేయటం కష్టం అంటూ జ్యోతికని పొగిడేసిన కంగనా..
చంద్రముఖి సీక్వెల్ లో లారెన్స్ హీరోగా నటిస్తున్నాడు. చంద్రముఖిగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటిస్తుంది. చంద్రముఖి పాత్రలో కంగనా రనౌత్ ని తీసుకున్నారు అని తెలియడంతో ఈ పాత్రకి ఆమె సూట్ అవ్వదు అంటూ పలువురు విమర్శలు చేశారు. వీటికి కంగనా కూడా.................
Kangana Ranaut : 2005లో వచ్చిన చంద్రముఖి సినిమా తెలుగు, తమిళ్ లో భారీ విజయం సాధించింది. వేరే భాషల్లో కూడా డబ్ అయి అక్కడ కూడా విజయం సాధించింది చంద్రముఖి. రజినీకాంత్, నయనతార జంటగా చంద్రముఖి పాత్రలో జ్యోతికతో ఈ సినిమా తెరకెక్కింది. చంద్రముఖిగా జ్యోతిక అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఒక రకంగా తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఈ సినిమా వచ్చిన 18 ఏళ్ళ తర్వాత ఇప్పుడు దీనికి సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు.
చంద్రముఖి సీక్వెల్ లో లారెన్స్ హీరోగా నటిస్తున్నాడు. చంద్రముఖిగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటిస్తుంది. చంద్రముఖి పాత్రలో కంగనా రనౌత్ ని తీసుకున్నారు అని తెలియడంతో ఈ పాత్రకి ఆమె సూట్ అవ్వదు అంటూ పలువురు విమర్శలు చేశారు. వీటికి కంగనా కూడా గతంలోనే కౌంటర్ ఇచ్చింది. తాజాగా మరోసారి చంద్రముఖి, జ్యోతిక గురించి మాట్లాడింది కంగనా.
Vedaant Madhavan : మరోసారి స్విమ్మింగ్ లో పతకాలు కొల్లగొట్టిన మాధవన్ తనయుడు..
గతంలో జ్యోతిక ఒక ఇంటర్వ్యూలో బాలీవుడ్ హీరోయిన్స్ లో ఇష్టమైన వాళ్ళు ఎవరు అని అడిగితే కంగనా రనౌత్ అని చెప్పింది. కంగనా అభిమానులు ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా కంగనా ఈ వీడియోని రీ ట్వీట్ చేస్తూ.. ఇది నాకు ఎంకరేజ్మెంట్ లాంటిది. చంద్రముఖి సినిమాలో జ్యోతిక అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. ప్రస్తుతం చంద్రముఖి 2 క్లైమాక్స్ షూట్ చేస్తున్నాము. దీంతో నేను ఇప్పుడు ప్రతి రోజు చంద్రముఖి సినిమా, ఆమె నటనని చూస్తున్నాను. చంద్రముఖి సినిమాలో ఆమె అసాధారణమైన ప్రదర్శన ఇచ్చింది. ఆమెతో పోలుస్తూ ఇప్పుడు నేను యాక్ట్ చేయడం చాలా కష్టమే అంటూ పోస్ట్ చేసింది.
That’s encouraging, as a matter of fact I am watching Jyothika ji’s iconic performance in Chandramukhi almost every day because we are shooting the climax it’s nerve wracking, how astonishing she is in the first part!! it is practically impossible to match up to her brilliance ? https://t.co/JENhDhbhFC
— Kangana Ranaut (@KanganaTeam) February 12, 2023