Kangana Ranaut : బట్టలు సరిగ్గా వేసుకో.. సౌత్ హీరోలని చూసి నేర్చుకో.. రణవీర్ సింగ్‌కు కంగనా కౌంటర్లు..

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ టైం దొరికినప్పుడల్లా కరణ్ జోహార్, బాలీవుడ్ మాఫియా అంటూ పలువురు స్టార్స్ పై విమర్శలు చేస్తూనే ఉంటుంది. తాజాగా రాకీ ఔర్‌ రాణీ కి ప్రేమ్‌ కహానీ సినిమా చూసిన కంగనా కరణ్ జోహార్ ని తీవ్రంగా విమర్శిస్తూ సినిమాలు మానేసి రిటైర్ తీస్కో అంది. రణవీర్ సింగ్ పై కూడా సంచలన కామెంట్స్ చేసింది.

Kangana Ranaut : బట్టలు సరిగ్గా వేసుకో.. సౌత్ హీరోలని చూసి నేర్చుకో.. రణవీర్ సింగ్‌కు కంగనా కౌంటర్లు..

Kangana Ranaut sensational comments on Ranveer Singh Dressing in Rocky Aur Rani Ki Prem Kahani

Updated On : July 30, 2023 / 1:31 PM IST

Kangana Ranaut :  బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ గురించి అందరికి తెలిసిందే. రణవీర్ తన సినిమాల కంటే తను వేసుకునే బట్టలతోనే బాగా వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. తాజాగా రణవీర్ సింగ్, అలియా భట్ జంటగా కరణ్ జోహార్ దర్శకత్వంలో రాకీ ఔర్‌ రాణీ కి ప్రేమ్‌ కహానీ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా జులై 28న రిలీజయింది. గతంలో కరణ్ జోహార్ చేసిన ప్రేమ కథల్లాగే ఇది కూడా ఉండటంతో యావరేజ్ టాక్ తో రన్ అవుతుంది. ఇక ఈ సినిమాలో కూడా రణవీర్ కొత్త కొత్త వెరైటీ బట్టలు వేశాడు. ఎప్పటిలాగే రణవీర్ తన బట్టలతో మరోసారి వైరల్ అవుతున్నాడు.

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ టైం దొరికినప్పుడల్లా కరణ్ జోహార్, బాలీవుడ్ మాఫియా అంటూ పలువురు స్టార్స్ పై విమర్శలు చేస్తూనే ఉంటుంది. తాజాగా రాకీ ఔర్‌ రాణీ కి ప్రేమ్‌ కహానీ సినిమా చూసిన కంగనా కరణ్ జోహార్ ని తీవ్రంగా విమర్శిస్తూ సినిమాలు మానేసి రిటైర్ తీస్కో అంది. రణవీర్ సింగ్ పై కూడా సంచలన కామెంట్స్ చేసింది. రణవీర్ నువ్వు బట్టలు సరిగ్గా వేసుకో, ఒక మనిషిలా వేసుకో, ఆ బాలీవుడ్ మాఫియా, కరణ్ జోహార్ కి కొంచెం దూరంగా ఉండి, నీలాగా ఉండు. ఒక్కసారి బట్టలు మంచిగా ఎలా వేసుకోవాలో సౌత్ హీరోలని చూసి నేర్చుకో అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది.

Bro Movie : అదరగోట్టిన ‘బ్రో’ కలెక్షన్స్.. రెండు రోజుల్లో 75 కోట్లు దాటేసిందిగా.. థియేటర్స్‌లో పవన్ సునామీ..

దీంతో కంగనా రనౌత్ రణవీర్ సింగ్ పై చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో సంచలనంగా మారాయి. అయితే రణవీర్ ని కంగనానే కాదు చాలా మంది నెటిజన్లు, ప్రేక్షకులు కూడా బట్టల విషయంలో విమర్శిస్తారు.