Kangana Ranaut : ఈ సినిమా మీకు తప్పుగా అనిపిస్తే మీరు టెర్రరిస్ట్ లే.. ది కేరళ స్టోరీ వివాదంపై కంగనా సంచలన వ్యాఖ్యలు..

ది కేరళ స్టోరీ సినిమా మే 5న దేశవ్యాప్తంగా రిలీజ్ చేశారు. కొన్ని థియేటర్స్ విమర్శలకు, వివాదాలకు, కొంతమంది హెచ్చరించడంతో భయపడి కేరళలో షోలని క్యాన్సిల్ చేశాయి. కొంతమంది ఈ సినిమా రిలీజ్ ని అడ్డుకోవాలని కూడా చూశారు.

Kangana Ranaut : ఈ సినిమా మీకు తప్పుగా అనిపిస్తే మీరు టెర్రరిస్ట్ లే.. ది కేరళ స్టోరీ వివాదంపై కంగనా సంచలన వ్యాఖ్యలు..

Kangana Ranaut supports The Kerala Story and makes sensational comments on people who oppose the film

Updated On : May 6, 2023 / 12:19 PM IST

Kangana Ranaut : కేరళలో(Kerala) కొంతమంది అమ్మాయిలను మతం మార్చి టెర్రరిజంలోకి తీసుకెళ్తున్నారు అనే రియల్ సంఘటనల ఆధారంగా వచ్చిన సినిమా ది కేరళ స్టోరీ(The Kerala Story). ఈ సినిమా టీజర్ రిలీజ్ నుంచి కూడా సినిమాపై పలువురు విమర్శలు చేస్తూ ఈ సినిమాని వివాదాల్లో నిలిపారు. కానీ ది కేరళ స్టోరీ సినిమాకు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ది కేరళ స్టోరీ సినిమాలో అదా శర్మ(Adah Sharma), సిద్ది ఇదాని(Siddhi Idnani), యోగితా.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు. సుదీప్తో సేన్ ఈ సినిమాని తెరకెక్కించాడు.

ఇప్పటికే వచ్చిన విమర్శలపై డైరెక్టర్, హీరోయిన్ అదాశర్మ ఫైర్ అయ్యారు. ది కేరళ స్టోరీ సినిమా మే 5న దేశవ్యాప్తంగా రిలీజ్ చేశారు. కొన్ని థియేటర్స్ విమర్శలకు, వివాదాలకు, కొంతమంది హెచ్చరించడంతో భయపడి కేరళలో షోలని క్యాన్సిల్ చేశాయి. కొంతమంది ఈ సినిమా రిలీజ్ ని అడ్డుకోవాలని కూడా చూశారు. కానీ చిత్రయూనిట్ హైకోర్టు వరకు కూడా వెళ్లి సినిమా ఆపకుండా కోర్టు ఆర్డర్స్ తెచ్చుకున్నారు. ప్రధాని మోడీ సైతం కర్ణాటక ఎలక్షన్స్ ప్రచారంలో ది కేరళ స్టోరీ సినిమాని సమర్థిస్తూ మాట్లాడారు. పలు చోట్ల మాత్రమే రిలీజయిన ది కేరళ స్టోరీ సినిమాకి మంచి ఆదరణ లభిస్తుంది. ఇందులో ఉగ్రవాదంకు వ్యతిరేకంగా చూపించడంతో ఈ సినిమాకు సపోర్ట్ గా పలువురు మాట్లాడుతున్నారు.

తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ది కేరళ స్టోరీ సినిమా గురించి మాట్లాడుతూ..నేను సినిమా ఇంకా చూడలేదు. కానీ సినిమాను నిషేధించడానికి చాలా మంది ప్రయత్నించారు. హైకోర్టు కూడా సినిమాని నిషేధించాల్సిన అవసరం లేదని తీర్పు ఇచ్చినా కొంతమంది ఈ సినిమాని అడ్డుకుంటున్నారు. ఇందులో ఎవ్వర్నీ చెడుగా చూపించలేదు. ISIS ఉగ్రవాద సంస్థ గురించి తప్పుగా చూపించింది. మన దేశంతో పాటు అనేక దేశాలు దాన్ని ఉగ్రవాద సంస్థగానే ప్రకటించాయి. అలా తప్పులు చేసే వాళ్ళ గురించి చూపిస్తే ఈ సినిమాకు సపోర్ట్ చేయాల్సింది పోయి సినిమాను అడ్డుకుంటున్నారు. అంటే అది ఉగ్రవాద సంస్థ కాదు అని మీరు సపోర్ట్ చేస్తే మీరు కూడా ఉగ్రవాదులే అవుతారుగా. ఈ సినిమా ISIS ఉగ్రవాదులకు వ్యతిరేకంగా తీసింది. అది మీకు వ్యతిరేకంగా అనిపిస్తే మీరు కూడా ఉగ్రవాదులే అవుతారు అని కంగనా వ్యాఖ్యానించింది.

దీంతో ఎప్పటిలాగే కంగనా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కంగనా వ్యాఖ్యలకు, ది కేరళ స్టోరీ సినిమాకు పలువురు మద్దతు పలుకుతూ కామెంట్స్, పోస్టులు చేస్తుండగా మరికొంతమంది విమర్శిస్తున్నారు.