Karan Johar : 5 కోట్ల కలెక్షన్స్ కూడా రావు.. 20 కోట్లు రెమ్యునరేషన్స్ కావాలి.. బాలీవుడ్ హీరోలపై కరణ్ జోహార్ సంచలన వ్యాఖ్యలు..
ఒక సినిమా నిర్మాణంలో ఎవరు ఎంత సంపాదిస్తున్నారనే ప్రశ్నకు కరణ్ సమాధానమిస్తూ దురదృష్ణవశాత్తు అందులో సగం భాగం స్టార్స్ దగ్గర ఉండిపోతోందని, ఈ విషయం చెబితే తనని మర్డర్ చేస్తారని షాకింగ్ విషయం తెలిపాడు కరణ్. అంతేకాదు 5 కోట్ల ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేని హీరోలు...........

Karan Johar comments on Bollywood stars remunarations
Karan Johar : బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తన కాంట్రవర్సియల్ కామెంట్స్ తో మరోసారి వార్తల్లో నిలిచాడు. బాలీవుడ్ టాప్ మోస్ట్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ అప్పుడప్పుడు బాలీవుడ్ లోని పలువురు హీరోల మీద తన ఫ్రస్ట్రేషన్ ను చూపిస్తుంటాడు. ఆయన పాడ్ కాస్ట్ లోని లేటెస్ట్ ఎపిసోడ్ లో బాలీవుడ్ హీరోలపై మరోసారి కాంట్రావర్సరీ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు. ఈ ఎపిసోడ్ లో తాను నిర్మించిన సూపర్ హిట్ మూవీ ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ కోసం ఎలా డబ్బులు పోగొట్టుకున్నాడో వివరిస్తూ హీరోలపై విరుచుకు పడ్డాడు.
ప్రెజెంట్ బాలీవుడ్ క్రేజీ స్టార్స్ అయిన ఆలియాభట్, సిద్ధార్ధ్ మల్హోత్రా, వరుణ్ ధావన్ లాంటి హీరోల్ని ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ మూవీతోనే కరణ్ బాలీవుడ్ కు పరిచయం చేశాడు. ఇద్దరు వ్యక్తులతో స్టార్టప్ కంపెనీలా ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించానని అయితే స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ లాంటి సూపర్ హిట్ మూవీ నిర్మించినా దాని వల్ల తనకి పైసా లాభం లేకుండా పోయిందని చెప్పి వాపోయాడు.
Samantha : శాకుంతలం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్.. సమంత వస్తుందా??
నేను చాలా ఎమోషనల్ అని, నా మనసంతా హిందీ సినిమాలపైనే ఉందని కరణ్ చెబుతూ కానీ తెలుగులో సినిమాలు తీయడం చాలా లాభదాయకమని తన అభిప్రాయాన్ని తెలిపాడు. ఒక సినిమా నిర్మాణంలో ఎవరు ఎంత సంపాదిస్తున్నారనే ప్రశ్నకు కరణ్ సమాధానమిస్తూ దురదృష్ణవశాత్తు అందులో సగం భాగం స్టార్స్ దగ్గర ఉండిపోతోందని, ఈ విషయం చెబితే తనని మర్డర్ చేస్తారని షాకింగ్ విషయం తెలిపాడు కరణ్. అంతేకాదు 5 కోట్ల ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేని హీరోలు 20 కోట్ల రెమ్యూనరేషన్ అడగడం ఎంతవరకు న్యాయమని పలువురు బాలీవుడ్ హీరోలని ఇండైరెక్ట్ గా ప్రశ్నించాడు కరణ్. ప్రస్తుతం ఈ కామెంట్స్ బాలీవుడ్ లో వైరల్ గా మారాయి. అసలే బాలీవుడ్ హీరోలు, సినిమాల మీద నెగిటివ్ కామెంట్స్, విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా బాలీవుడ్ హీరోలపై కామెంట్స్ చేయడంతో అంతా దీని గురించే చర్చిస్తున్నారు. మరి కరణ్ వ్యాఖ్యలపై ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.