Kareena Kapoor: ప్రెగ్నెన్సీ వార్తలపై మండిపడ్డ స్టార్ బ్యూటీ..!
బాలీవుడ్ స్టార్ బ్యూటీ కరీనా కపూర్ మూడోసారి ప్రెగ్నెన్సీ దాల్చిందని బీటౌన్‌లో వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ వార్తలపై కరీనా కపూర్ క్లారిటీ ఇచ్చింది. తాము ఇకపై పిల్లల్ని కనబోమంటూ ఆమె చెప్పుకొచ్చింది.

Kareena Kapoor Slams Reports Of Her Pregnancy
Kareena Kapoor: బాలీవుడ్ స్టార్ బ్యూటీ కరీనా కపూర్ ఇప్పటికే ఇద్దరు పిల్లల తల్లిగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయినా కూడా యాక్టింగ్ పట్ల తనకున్న ఆసక్తితో సినిమాలు చేస్తూ బిజీగా మారింది. బాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్టుల్లో ఇంకా హీరోయిన్ పాత్రలు చేస్తూ తన సత్తా చాటుతోంది ఈ బ్యూటీ. అటు ఆమె భర్త, బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూడా విభిన్నమైన పాత్రలు చేస్తూ సినిమాల్లో బిజీగా ఉన్నాడు. అయితే ఇటీవల కరీనా కపూర్ ఖాన్ విషయంలో బాలీవుడ్ మీడియాలో ఓ వార్త జోరుగా ప్రచారం అవుతూ వస్తోంది.
Kareena Kapoor: పీలికల డ్రెస్ రూ.70 వేలు.. డిజైనర్‌పై ట్రోలింగ్!
కరీనా కపూర్ ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చిన తరువాత మరోసారి ప్రెగ్నెన్సీతో ఉన్నట్లుగా బీటౌన్ మీడియాలో వార్తలు జోరుగా హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో కరీనా కపూర్ తాజాగా ఈ వార్తలపై స్పందించింది. తమకు ఇద్దరు పిల్లలున్న సంగతి అందరికీ తెలిసిందేనని.. ఇప్పుడు మూడో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు వస్తున్న వార్తలు కేవలం పుకార్లేనని ఆమె మండి పడింది. తన భర్త ఈ దేశ జనాభాలో ఇప్పటికే ఇద్దరిని పెంచేశాడని.. ఇకపై తాము జనాభాను పెంచబోమని ఆమె క్లారిటీ ఇచ్చింది. తమకు పిల్లల్ని కనడమే పని కాదని, జీవితంలో మిగతా పనులు కూడా ఉన్నాయంటూ చాలా బోల్డ్‌గా కామెంట్స్ చేసింది ఈ స్టార్ బ్యూటీ.
Kareena Kapoor : నైటీతో బయటకి వచ్చిందంటూ కరీనాను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..
దీంతో బాలీవుడ్ మీడియాలో వస్తున్న కరీనా ప్రెగ్నెన్సీ పుకార్లకు చెక్ పడినట్లు అయ్యింది. ఇక ప్రస్తుతం చేతినిండా పలు క్రేజీ ప్రాజెక్టులతో కరీనా బిజీగా ఉందని, తన భర్త కూడా సినిమాలతో బిజీగా ఉన్నాడని కరీనా క్లారిటీ ఇచ్చింది. అంటే కరీనా-సైఫ్ జోడీ ఇక పిల్లల్ని కనబోరనే విషయంపై మాత్రం క్లారిటీ వచ్చిందనే చెప్పాలి. ఇకనైనా కరీనా ప్రెగ్నెన్సీ వార్తలు ఆగుతాయో లేదో చూడాలి.