Bhaje Vaayu Vegam Song : నువ్ లవర్.. నేను ఫ్లవర్.. తగ్గేదేలే అంటున్న కార్తికేయ.. ‘భజే వాయు వేగం’ ఫస్ట్ సాంగ్ రిలీజ్..
తాజాగా భజే వాయు వేగం సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల చేశారు.

Kartikeya Iswarya Menon Bhaje Vaayu Vegam Movie First Song Released
Bhaje Vaayu Vegam Song : హీరో కార్తికేయ(Kartikeya) త్వరలో ‘భజే వాయు వేగం’ సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో ఈ భజే వాయు వేగం తెరకెక్కుతుంది. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా, హ్యాపీడేస్ ఫేమ్ రాహుల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా మే 31న రిలీజ్ కాబోతున్నట్టు ఆల్రెడీ ప్రకటించారు చిత్రయూనిట్ .
Also Read : Sai Pallavi : ‘తండేల్’ నుంచి సాయి పల్లవి క్యూట్ మేకింగ్ వీడియో వచ్చేసింది.. బర్త్‌డే స్పెషల్..
ఇప్పటికే భజే వాయు వేగం సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది. తాజాగా భజే వాయు వేగం సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ‘నువ్ లవర్.. నేను ఫ్లవర్.. తగ్గేదేలే.. సెట్ అయ్యిందే లైఫ్ సెట్ అయ్యిందే నీ వల్లే నా లైఫ్ సెట్టయ్యిందే..’ అంటూ మాసివ్ లవ్ సాంగ్ ని విడుదల చేశారు. ఈ పాట చాలా క్యాచీగా ఉంది. సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి ఈ పాటని రాయగా రధన్ సంగీత దర్శకత్వంలో రంజిత్ గోవింద్ ఎనర్జిటిక్ గా పాడారు. విశ్వ రఘు కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ లోని హుక్ స్టెప్ రీల్స్ లో వైరల్ అయ్యేలా ఉంది. మీరు కూడా ఈ పాట వినేయండి..