Atharva : KCPD అంట.. ఇదేం సాంగ్ బ్రో.. కేసీపీడీ సాంగ్ విన్నారా..?

క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ గా ఆడియన్స్ ముందుకు రాబోతున్న 'అథర్వ' మూవీ నుంచి KCPD అనే సాంగ్ రిలీజ్ అయ్యింది.

Atharva : KCPD అంట.. ఇదేం సాంగ్ బ్రో.. కేసీపీడీ సాంగ్ విన్నారా..?

KCPD Video Song released from Atharva movie

Updated On : November 25, 2023 / 4:39 PM IST

Atharva : క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ వెబ్ సిరీస్‌లు అలవాటు అయిన దగ్గర నుంచి ఆడియన్స్ అంతా ఆ తరహా సినిమాలు పైనే ఆసక్తి చూపిస్తున్నారు. అటువంటి చిత్రాలు చిన్న సినిమాగా వచ్చినా బాక్స్ ఆఫీస్ వద్ద దానిని పెద్ద హిట్టుగా మారుస్తున్నారు. ఇలాంటి ఒక క్రైమ్ థ్రిల్లర్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్న తాజా చిత్రమే ‘అథర్వ’. మహేష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా నటించారు. క్లూస్ టీం, ఫోరెన్సిక్ విభాగం కోణం నుంచి కంప్లీట్ ఎమోషన్స్ తో ఈ సినిమాని రూపొందించారు.

ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం రిలీజ్ కి సిద్దమవుతుంది. అలాగే మరోపక్క ప్రమోషన్స్ తో కూడా సందడి చేస్తూ ఆడియన్స్ కి సినిమా దగ్గరయ్యేలా చేస్తున్నారు. ఈక్రమంలోనే టీజర్, ట్రైలర్ అండ్ సాంగ్స్ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ‘కేసీపీడీ’ అనే సాంగ్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ట్రేండింగ్ పదం అయిన కేసీపీడీతో కిట్టూ విస్సాప్రగడ రాసిన సాంగ్ లిరిక్స్ యూత్ ని ఆకట్టుకునేలా ఉన్నాయి. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తూ ఈ పాటని పాడారు. భాను మాస్టర్ డాన్స్ కొరియోగ్రఫీ చేశారు.

Also read : Tillu Square : టిల్లు గాడు సెకండ్ సింగిల్‌ని తీసుకొచ్చేశాడు.. రాధిక రింగులు జుట్టుకి..

నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుభాష్ నూతలపాటి ఈ సినిమాని నిర్మించారు. విజయ, ఝాన్సీ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరించారు. డిసెంబర్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రీసెంట్ గా ఈ మూవీని డిపార్ట్మెంట్ లోని క్లూస్ అండ్ ఫోరెన్సిక్ టీంకి స్పెషల్ షో వేసి చూపించారు. క్లూస్ టీంకి సంబంధించిన కథను ఇంత బాగా ఏ సినిమాలో చూపించలేదని అథర్వ చిత్రాన్ని ఆకాశానికెత్తేశినట్లు నిర్మాతలు తెలియజేశారు.