Tillu Square : టిల్లు గాడు సెకండ్ సింగిల్‌ని తీసుకొచ్చేశాడు.. రాధిక రింగులు జుట్టుకి..

'టిల్లు స్క్వేర్' నుంచి సెకండ్ సింగిల్ ప్రోమోని రిలీజ్ చేసిన మేకర్స్. ఈసారి రాధిక రింగులు జుట్టుకి..

Tillu Square : టిల్లు గాడు సెకండ్ సింగిల్‌ని తీసుకొచ్చేశాడు.. రాధిక రింగులు జుట్టుకి..

Radhika Song Promo released from Tillu Square movie

Updated On : November 25, 2023 / 4:21 PM IST

Tillu Square : డీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యిపోయిన సిద్దు జొన్నలగడ్డ.. ఇప్పుడు ఆ చిత్రానికే సీక్వెల్ ని సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ‘టిల్లు స్క్వేర్’ అనే టైటిల్ ని పెట్టుకున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సీక్వెల్ లో టిల్లుకి జోడిగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు. ఇక ఆల్రెడీ మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేసిన టిల్లు.. ఇప్పటికే ఒక సాంగ్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ‘టికెటే కొనకుండా’ అంటూ మొదటి సాంగ్ ని చూపించిన టిల్లు.. ఇప్పుడు సెకండ్ సింగిల్ ని తీసుకు వస్తున్నాడు.

రాధిక రింగులు జుట్టుకి పడిపోయానంటూ.. టిల్లు ప్రేమగోల చేస్తున్నాడు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించిన ఈ పాటకి రామ్ మిరియాల సంగీతం అందిస్తూ పాటని పాడారు. సాంగ్ చూడడానికి చాలా కలర్ ఫుల్ గా ఉంది. ఈ ఫుల్ సాంగ్ నవంబర్ 27న సాయంత్రం 4:05 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కాగా ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సిద్దునే కథని అందిస్తున్నారు. టిల్లు 1కి సిద్ధునే కథని, మాటల్ని అందరించారు.

Also read : Samantha : జిమ్‌లో సమంత కసరత్తులు చూశారా..? వీడియో వైరల్..

ఇక ఈ సెప్టెంబర్ లోనే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ వచ్చే ఏడాదికి పోస్టుపోన్ అయ్యింది. 2024 ఫిబ్రవరి 9న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఆల్రెడీ పాజిటివ్ బజ్ ఉండడం, యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న అనుపమ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడం.. మూవీకి ప్లస్ పాయింట్స్ అయ్యాయి. మరి ఈ సినిమాతో టిల్లు గాడు ఏ రేంజ్ గోల చేస్తాడో చూడాలి.