కీర్తి సురేష్ కొత్త సినిమా ప్రారంభం

మహేష్ కోనేరు నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం:3 మూవీలో కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ సినిమా ద్వారా నరేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

  • Published By: sekhar ,Published On : January 10, 2019 / 12:23 PM IST
కీర్తి సురేష్ కొత్త సినిమా ప్రారంభం

Updated On : January 10, 2019 / 12:23 PM IST

మహేష్ కోనేరు నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం:3 మూవీలో కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ సినిమా ద్వారా నరేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

మహానటి సావిత్రి బయోపిక్, మహానటితో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. మహానటి తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని, కొత్త సినిమాకి కొబ్బరికాయ కొట్టింది. నా నువ్వే సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన మహేష్ కోనేరు నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం:3 మూవీలో కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ సినిమా ద్వారా నరేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందబోయే లేడీ ఓరియంటెడ్ మూవీ అని తెలుస్తుంది. రీసెంట్‌గా పూజా కార్యక్రమాలతో ఈ సినిమాని లాంఛనంగా ప్రారంభించారు.

నందమూరి కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్‌పై క్లాప్‌నివ్వగా, దిల్ రాజు, స్రవంతి రవికిషోర్ కలిసి, డైరెక్టర్‌కి స్క్రిప్ట్ అందించారు. పరుచూరి గోపాల కృష్ణ, డైరెక్టర్ హరీష్ శంకర్, వెంకీ అట్లూరి, స్వప్నాదత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకి కళ్యాణి మాలిక్ సంగీతమందిస్తున్నాడు. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతుంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.