Keerthy Suresh : పెళ్లయ్యాక మరింత బోల్డ్ క్యారెక్టర్స్ చేస్తున్న కీర్తి సురేష్.. అక్కా అంటూ..
కీర్తిసురేశ్ ఇటీవల కెరీర్ స్పీడ్ పెంచేసింది. ఇలాంటి క్యారెక్టరే చేస్తాను, అలా అయితే చెయ్యను అంటూ లిమిటేషన్స్ పెట్టుకోకుండా బోల్డ్, గ్లామర్ కంటెంట్ ని కూడా స్టార్ట్ చేస్తోంది.

Keerthy Suresh Doing Bold Characters after Marriage and After entry in Bollywood
Keerthy Suresh : సింపుల్ ,హోమ్లీ క్యారెక్టర్స్ చేస్తూ గ్లామర్ కి దూరంగానే ఉన్న కీర్తిసురేశ్ ఇప్పుడు స్పీడ్ పెంచింది. ఇలా ఉంటే ఈ గ్లామర్ వరల్డ్ లో వర్కవుట్ కాదని తన సినిమాల విషయంలో అగ్రెసివ్ గా వెళుతోంది. మొన్నమొన్నటి వరకూ సింపుల్ గా కనిపించిన కీర్తి ఇప్పుడు గ్లామర్ తో పాటు బోల్డ్ కంటెంట్ కి కూడా రెడీ అవుతోంది.
కీర్తిసురేష్.. మహానటి ముందు వరకూ ఒక లెక్క మహానటి తర్వాత ఒకలెక్క. మహానటితో సౌత్ మొత్తం ఎంత పేరు తెచ్చిపెట్టిందో కీర్తి క్యారెక్టర్లని అంతే లిమిట్ చేసింది. ఆ సినిమా తర్వాత గ్లామర్ క్యారెక్టర్లకి మరీ దూరం జరిగాల్సొచ్చింది కీర్తికి. అలా ఉండడంతో పెద్దగా ఆఫర్లు రాక, హైలైట్ అవ్వక కెరీర్ క్లాస్త స్లో అయ్యింది. దాంతో రియలైజ్ అయిన కీర్తి బోల్డ్ అండ్ అగ్రెసివ్ రోల్స్ కి రెడీ అనడమే కాదు ఆ రూట్లో వెళ్తూ ఫుల్ బిజీ అవుతోంది.
Also Read : Rana – Siddharth : ఓ వైపు రానా – మరో వైపు సిద్దార్థ్.. నెట్ ఫ్లిక్స్ లో త్వరలో రెండు సిరీస్ లు..
కీర్తిసురేశ్ ఇటీవల కెరీర్ స్పీడ్ పెంచేసింది. ఇలాంటి క్యారెక్టరే చేస్తాను, అలా అయితే చెయ్యను అంటూ లిమిటేషన్స్ పెట్టుకోకుండా బోల్డ్, గ్లామర్ కంటెంట్ ని కూడా స్టార్ట్ చేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ లో వరుణ్ ధావన్ హీరోగా వచ్చిన బేబీజాన్ మూవీలో బాలీవుడ్ హీరోయిన్లలానే ఫుల్ గ్లామరస్ గా కనిపించింది. దాంతో అప్పటి వరకూ కీర్తిని చాలా పద్దతిగా చూసిన వాళ్లు బేబీజాన్ లో కీర్తిని చూసి ఒకరకంగా షాక్ అయ్యారు.
లేటెస్ట్ గా నెట్ ఫ్లిక్స్ చేస్తున్న అక్కా సిరీస్ లో సీరియస్ మాఫియా రోల్ లోనే కాస్త బోల్డ్ గాకనిపించబోతోంది కీర్తిసురేశ్. సౌత్ లో ఉన్నంత వరకూ సింపుల్ గా ఉండే రోల్స్ చేసిన కీర్తిసురేశ్ బాలీవుడ్ కి వెళ్లగానే బోల్డ్ గా తయారవ్వడంతో నార్త్ స్టైల్ ని బాగానే వంటపట్టించుకుందంటున్నారు అభిమానులు. అంతేకాదు ఇప్పటి వరకూ పెద్దగా చాన్సులు రాని కీర్తికి ఇక ఇప్పటి నుంచి ఎక్కువే వస్తాయంటూ జోస్యాలు కూడా చెబుతున్నారు.
Also Read : Aha OTT : ఆహా ఓటీటీలో సరికొత్త రొమాంటిక్ కామెడీ క్రైమ్ సినిమా.. మలయాళం డబ్బింగ్..
నిజానికి మహానటి తర్వాత మహేశ్ బాబుతో చేసిన సర్కారు వారి పాటలో కాస్త గ్లామర్ డోస్ పెంచినా కూడా పెద్దగా పట్టించుకోలేదు. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ ఆఫర్స్ ఇవ్వలేదు. దాంతో సోషల్ మీడియాలో కాస్త గ్లామరస్ ఫోటోలతో ఇంప్రెస్ చేస్తూనే ఉంది. ఇటీవలే పెళ్లి కూడా అచేసుకున్న కీర్తి పెళ్లి తర్వాతే రిలీజయిన బేబీ జాన్ ప్రమోషన్స్ లో హాట్ హాట్ గానే కనిపించింది. బాలీవుడ్ లో ఎలా ఉండాలో అలాగే ఉంటూ ఇంప్రస్ చేస్తుంది. ఇటీవల నెట్ ఫ్లిక్స్ అక్కా అనే సిరీస్ గ్లింప్స్ రిలీజ్ చేసింది. గ్లింప్స్ లోనే బోల్డ్, రఫ్ లుక్ లో కనపడ్డ కీర్తి ఫుల్ సిరీస్ లో ఇంకే రేంజ్ లో బోల్డ్ చూపిస్తుందో చూడాలి. ఈ అక్కా సిరీస్ తర్వాత బాలీవుడ్ లో ఇంకెన్ని బోల్డ్ చాన్సులు దక్కించుకుంటుందో చూడాలి. పెళ్లి తర్వాత కూడా కీర్తి బోల్డ్ పాత్రలకు ఓకే చెప్తుంది అని ఆశ్చర్యపోరుతున్నారు.