8th Pay Commission : 8వ వేతన సంఘంపై బిగ్ అప్‌డేట్.. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఇదేనా? భారీగా పెరగనున్న కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు..!
8th Pay Commission : 8వ వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి వస్తే.. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు భారీగా పెరగొచ్చు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంతంటే?

8th Pay Commission
8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. రాబోయే 8వ వేతన సంఘంతో ఉద్యోగుల వేతనాలు భారీగా పెరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం జనవరి 2026 నుంచి 8వ వేతన సంఘం (8వ CPC) అమలుపై భారీ సన్నాహాలు చేస్తోంది.
ఈ వేతన సంఘంతో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 అమలుపై కూడా అనేక (8th Pay Commission) ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే అమలు చేస్తే.. కోటి మందికిపైగా కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ ప్రయోజనం కలగనుంది. అందిన సమాచారం ప్రకారం.. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86గా చేయాలని ప్రతిపాదన చేయగా ప్రస్తుత 7వ వేతన సంఘంలో 2.57గా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఉంది. ఇప్పుడు దీనిపైనే అందరి దృష్టి పడింది.
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంపు :
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 వర్తింపజేస్తే.. కనీస వేతనం రూ. 18వేల నుంచి రూ. 51,480కి పెరగవచ్చు. కనీస పెన్షన్ రూ. 9వేలు నుంచి రూ. 25,740కి పెరగవచ్చు. అంతేకాదు.. డియర్‌నెస్ అలవెన్స్ (DA), ఇంటి అద్దె అలవెన్స్ (HRA), ప్రయాణ అలవెన్స్ (TA) కూడా పెరుగుతాయి.
ఉద్యోగుల లెవల్స్ ఆధారంగా వేతన స్కేళ్లు ఎంత ఉండొచ్చంటే?
లెవల్ 1 : రూ. 18,000 నుంచి రూ. 51,480
లెవల్ 5 : రూ. 29,200 నుంచి రూ. 83,512
లెవల్ 10 : రూ. 56,100 నుంచి రూ. 1,60,446
లెవల్ 13A : రూ. 1,31,100 నుంచి రూ. 3,74,946
లెవల్ 18 : రూ. 2,50,000 నుంచి రూ. 7,15,000
8వ సీపీసీలోని పెన్షన్ ఫార్ములా కూడా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా ఉంటుంది. కనీస పెన్షన్ దాదాపు 186 శాతం పెరిగి రూ.25,740కి చేరుకుంటుంది. దాంతో రిటైర్మెంట్ చేసిన ఉద్యోగులకు భారీ
ఉపశమనం లభిస్తుంది.
మరోవైపు.. జనవరి 2026 నుంచి 8వ వేతన సంఘం అమలుపై ఎలాంటి ఆలస్యం జరగకుండా త్వరగా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఉద్యోగి సంస్థలు ప్రభుత్వాన్ని కోరాయి. కమిషన్ ఏర్పాటు కోసం రాష్ట్రాలతో సంప్రదింపులు కూడా జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
2016లో 7వ వేతన సంఘం అమల్లోకి రాగానే కనీస వేతనం రూ.7వేలు నుంచి రూ.18వేలకి పెరిగింది. కనీస పెన్షన్ రూ.3,500 నుంచి రూ.9వేలకి పెరిగింది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఉద్యోగుల ఆదాయం, పెన్షన్ పై భారీ ప్రభావం చూపుతుంది. తద్వారా వేతనం, పెన్షన్ భారీగా పెరుగుతుంది.
8వ వేతన సంఘం అమలు ఎప్పుడంటే? :
8వ వేతన సంఘం జనవరి 2026 నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల జీతం, పెన్షన్‌లో భారీ మార్పులు జరగనున్నాయి. ప్రతిపాదిత ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86గా ఉంటే.. కనీస వేతనం రూ. 18వేలు నుంచి రూ. 51,480కి పెరగవచ్చు. కనీస పెన్షన్ రూ. 9వేలు నుంచి రూ. 25,740కి చేరుకోవచ్చు.
ఏయే భత్యాలు పెరగొచ్చంటే? :
8వ సీపీసీ కింద డియర్‌నెస్ అలవెన్స్ (DA), ఇంటి అద్దె అలవెన్స్ (HRA), ట్రావెల్ అలవెన్స్ (TA) కూడా పెరుగుతాయని భావిస్తున్నారు. అదే జరిగితే ప్రభుత్వ ఉద్యోగుల మొత్తం జీతం, పెన్షన్ భారీగా పెరగనుంది.