Smriti Mandhana : చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. ఆస్ట్రేలియా పై ఫాస్టెస్ట్ సెంచరీ..
మహిళల వన్డే క్రికెట్‌లో స్మృతి మంధాన (Smriti Mandhana) ఆస్ట్రేలియాపై వేగవంతమైన సెంచరీ చేసిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది.

Smriti Mandhana creates history Fastest 100 Against Australia In WODIs
Smriti Mandhana : టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించింది. వన్డేల్లో ఆస్ట్రేలియా పై అత్యంత వేగంగా సెంచరీ చేసిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. ముల్లన్‌పూర్‌లో ఆస్ట్రేలియాతో రెండో వన్డేల్లో 77 బంతుల్లో మంధాన (Smriti Mandhana) శతకం చేయడంతో ఈ ఘనత సాధించింది.
అంతకముందు ఈ రికార్డు ఇంగ్లాండ్ బ్యాటర్ నాట్‌స్కైవర్ బ్రంట్ పేరిట ఉంది. 2022 మార్చి 5న హామిల్టన్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో బ్రంట్ 79 బంతుల్లో సెంచరీ చేసింది. ఈ జాబితాలో మంధాన, బ్రంట్ తరువాత లిజెల్లె లీ, హర్మన్ ప్రీత్ కౌర్‌లు ఉన్నారు.
ICC rankings : టీ20 ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా ఆటగాళ్ల హవా.. అన్నింటా మనోళ్లే టాప్..
మహిళల వన్డే క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్లు..
* స్మృతి మంధాన (భారత్) – 77 బంతుల్లో (2025 సెప్టెంబర్ 17)
* నాట్‌స్కైవర్ బ్రంట్ (ఇంగ్లాండ్) – 79 బంతుల్లో (2022లో)
* లిజెల్లెలీ (దక్షిణాఫ్రికా) – 86 బంతుల్లో (2016లో)
* హర్మన్ ప్రీత్ కౌర్ (భారత్) – 90 బంతుల్లో (2017లో)
* నాట్‌స్కైవర్ బ్రంట్ (ఇంగ్లాండ్) – 90 బంతుల్లో (2022లో)
సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ..
మహిళల వన్డే క్రికెట్‌లో టీమ్ఇండియా తరుపున రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ప్లేయర్‌గానూ మంధాన రికార్డుల్లోకి ఎక్కింది. తొలి ప్లేయర్‌గానూ ఆమె పేరిటే రికార్డు ఉండడం విశేషం. గతంలో ఐర్లాండ్ పై 70 బంతుల్లో మంధాన సెంచరీ చేసింది.
మహిళల వన్డే క్రికెట్‌లో టీమ్ఇండియా తరుపున ఫాస్టెస్ట్ చేసిన ప్లేయర్లు వీరే..
* స్మృతి మంధాన – 70 బంతుల్లో (2025లో ఐర్లాండ్ పై)
* స్మృతి మంధాన – 77 బంతుల్లో (2025లో ఆస్ట్రేలియాపై)
* హర్మన్ ప్రీత్ కౌర్ – 82 బంతుల్లో (2025లో ఇంగ్లాండ్ పై)
* హర్మన్ ప్రీత్ కౌర్ – 87 బంతుల్లో (2024లో దక్షిణాఫ్రికా పై)
* జెమీమా రోడ్రిగ్స్ – 89 బంతుల్లో (2025లో దక్షిణాఫ్రికా పై )
వన్డేల్లో అత్యధిక శతకాలు సాధించిన జాబితాలో..
వన్డేల్లో మంధానకు ఇది 12వ శతకం. ఈ క్రమంలో వన్డేల్లో అత్యధిక శతకాలు సాధించిన ప్లేయర్ల జాబితాలో టామీ బ్యూమాంట్ తో కలిసి మూడో స్థానంలో నిలిచింది. మెగ్ లాన్నింగ్, సుజీ బేట్స్ లు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు సాధించిన ప్లేయర్లు వీరే..
* మెగ్ లాన్నింగ్ – 15 సెంచరీలు
* సుజీ బేట్స్ – 13 సెంచరీలు
* టామీ బ్యూమాంట్ – 12 సెంచరీలు
* స్మృతి మంధాన – 12 సెంచరీలు
* షార్లెట్ ఎడ్వర్డ్స్, చమరి అతపత్తు, హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్ లు తలా తొమ్మిది శతకాలు సాధించారు.