బన్నీ పక్కన పూరి పోరి.. ‘అహా’ కోసం అదిరే ప్రమోషన్..

‘అహా’ ప్రమోషనల్ వీడియోలో బన్నీతో జతకడుతున్న కేతికా శర్మ..

  • Published By: sekhar ,Published On : March 11, 2020 / 10:34 AM IST
బన్నీ పక్కన పూరి పోరి.. ‘అహా’ కోసం అదిరే ప్రమోషన్..

Updated On : March 11, 2020 / 10:34 AM IST

‘అహా’ ప్రమోషనల్ వీడియోలో బన్నీతో జతకడుతున్న కేతికా శర్మ..

ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఇటీవల డిజిటల్ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. అమెజాన్,  నెట్ ఫ్లిక్స్‌కు ధీటుగా తెలుగు సినిమాలను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసేందుకు అల్లు అరవింద్ ‘అహా’ అనే ఓటీటీ(OTT) ఫ్లాట్ ఫామ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

దీనికి యంగ్ హీరో విజయ్ దేవరకొండ, నవదీప్, బిందు మాధవి తదితరులు ప్రమోషన్ చేస్తున్నారు. ‘అహా’ను మరింతగా ప్రేక్షకులకు చేరవ చేసేందుకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, హీరోయిన్ కేతికా శర్మలపై బ్రహ్మాండమైన ప్రమోషనల్ వీడియో ప్లాన్ చేశారు.

కేతికా శర్మ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కొడుకు  ఆకాష్ పూరి సరసన ‘రొమాంటిక్’ చిత్రంలో నటిస్తుంది. టాలీవుడ్‌లో ఇదే ఆమె ఫస్ట్ మూవీ. అల్లు అర్జున్, కేతికా శర్మ కాంబినేషన్‌లో ‘అహా’ కోసం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ ఓ యాడ్ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో  ఈ యాడ్ షూట్ జరుగుతోందట. 

See Also | రాహుల్‌పై దాడిచేసిన నిందితుల కోసం గాలింపు – బెంగుళూరుకు స్పెషల్ టీమ్స్..