వావ్.. లింక్ భలే సింక్ అయిందిగా!
రాకింగ్ స్టార్, యంగ్ రెబల్ స్టార్, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాల మధ్య ఆసక్తికరమైన పోలిక..

రాకింగ్ స్టార్, యంగ్ రెబల్ స్టార్, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాల మధ్య ఆసక్తికరమైన పోలిక..
కన్నడ రాకింగ్ స్టార్ యశ్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లకు సంబంధం ఏంటి?.. వీళ్లు నలుగురు కలిసి ఏదైనా మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారా.. యశ్ బర్త్‌డేకి, ప్రభాస్ పుట్టినరోజుకి లింకేంటి.. అనుకుంటున్నారా..
యశ్ నటిస్తున్న ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’, ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ కి, ప్రభాస్‌కి మధ్య పోలిక ఏంటి అంటే.. ‘కె.జి.ఎఫ్.’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘కె.జి.ఎఫ్.2’ దసరా కానుకగా 2020 అక్టోబర్ 23న విడుదల కానుంది. అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టినరోజు..
అలాగే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘RRR’ 2021 జనవరి 8న రిలీజ్ కానుంది. ఆ రోజు యశ్ బర్త్‌డే.. ఈ లెక్కన ప్రభాస్ పుట్టినరోజు నాడు ‘కె.జి.ఎఫ్.2’, యశ్ బర్త్‌డే రోజు ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం విడుదలవనుంది. ‘కె.జి.ఎఫ్.2’ అయిదు భాషల్లో, ‘ఆర్ఆర్ఆర్’ పది భాషల్లో విడుదల అవనున్నాయి.