KGF Yash New Home : కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన `KGF` స్టార్ యశ్.. ఫొటోలు వైరల్!
KGF మూవీతో పాపులర్ కన్నడ రాక్‌స్టార్ యశ్ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టాడు. సతీసమేతంగా యశ్ సాంప్రదాయ పద్ధతిలో నూతన గృహ ప్రవేశం చేశాడు. బెంగుళూరులోని ఖరీదైన ప్రెస్టీజ్ గోల్ఫ్ అపార్ట్ మెంట్‌లో ఇంటిని కొనుగోలు చేశాడు.

Kgf 2 Star Yash And Radhika Pandit Move Into A Lavish New Home
KGF Star Yash New Home : KGF మూవీతో పాపులర్ అయిన కన్నడ రాక్‌స్టార్ యశ్ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టాడు. సతీసమేతంగా రాక్ స్టార్ యశ్ సాంప్రదాయ పద్ధతిలో నూతన గృహ ప్రవేశం చేశాడు. బెంగుళూరులోని ఖరీదైన ప్రెస్టీజ్ గోల్ఫ్ అపార్ట్ మెంట్‌లో ఇంటిని కొనుగోలు చేశాడు.
భార్య రాధికా పండిత్‌తో కలిసి గృహ ప్రవేశం చేశాడు. పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కేజీఎఫ్ మూవీతో పాన్‌ఇండియా స్టార్ గుర్తింపు తెచ్చుకున్నాడు యశ్.. ఈ ఫొటోల్లో యశ్ దంపతులతోపాటు కుటుంబ సభ్యులు, అత్యంత సమీప బంధువులు హాజరయ్యారు.
ప్రస్తుతం యశ్.. `KGF`కి పార్ట్ 2 `KGF ఛాప్టర్ 2`లో నటించగా.. అతి త్వరలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనా టండన్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ వంటి లీడ్ రోల్స్ లో నటించారు.
ఈ మూవీని కన్నడ, తెలుగుతోపాటు తమిళం, హిందీలోనూ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. యశ్ ఆరంజ్ సిల్క్ షర్ట్, తెల్ల దోతీ ధరించగా.. సతీమణి రాధిక ఆరెంజ్, బ్లూ సిల్క్ శారీలో మెరిసిపోయారు.
గృహప్రవేశంలో భాగంగా ఇంటిని పూలతో అందంగా అలంకరించారు. మార్బల్ ఫ్లోర్స్, ఫ్రెంచ్ విండోలతో ఇంటిని అందంగా తీర్చిదిద్దారు. యశ్ తల్లిదండ్రులు పుష్ప, అరుణ్ కుమార్ లతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు యశ్ దంపతులు.
కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన సందర్భంగా తన కుటుంబంతో కలిసి యశ్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.