కె.జి.యఫ్ – ఫస్ట్ లుక్ అప్‌డేట్

‘కేజీఎఫ్‌-2’ - డిసెంబర్‌ 21న సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేయనున్నారు..

  • Published By: sekhar ,Published On : December 14, 2019 / 09:30 AM IST
కె.జి.యఫ్ – ఫస్ట్ లుక్ అప్‌డేట్

Updated On : December 14, 2019 / 9:30 AM IST

‘కేజీఎఫ్‌-2’ – డిసెంబర్‌ 21న సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేయనున్నారు..

సౌత్‌ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించి, బాక్సాఫీస్‌ వద్ద  రూ. 200 కోట్ల వసూళ్లు సాధించి, యావత్ సినీ ప్రపంచం కన్నడ పరిశ్రమవైపు చూసేలా చేసిన  సినిమా ‘కేజీఎఫ్‌’. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత‍్వం వహించిన ఈ సినిమా 2018లో  బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది. రాక్ స్టార్ యశ్‌ను ఓవర్‌ నైట్‌ స్టార్‌ను చేసింది.

Image result for KGF

భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ  సినిమాకు సీక్వెల్‌గా ‘కేజీఎఫ్‌-2’ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ ప్రతినాయకుడు అధీరా పాత్రలో నటిస్తున్నారు. డిసెంబర్‌ 21న సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేయనున్నారు.

Image

అంటే ‘కేజీఎఫ్‌’ మొదటి భాగం (21 డిసెంబర్‌ 2018) విడుదలైన సరిగ్గా ఏడాదికి గుర్తుగా ఈ పోస్టర్‌ను రిలీజ్‌ చేయననున్నారు. యశ్‌కు జోడిగా శ్రీనిధి శెట్టి నటిస్తున్న ఈ మూవీలో రవీనా టాండన్‌, అనంత్‌ నాగ్‌, మాళవిక అవినాష్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2020 వేసవిలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.