Kiccha Sudeep : కిచ్చా సుదీప్‌కి బెదిరింపు లేఖ.. బీజేపీలో చేరవద్దు!
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కి బెదిరింపు లేఖ. బీజేపీలో చెరితే తన ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు బహిర్గతం చేస్తామంటూ వార్నింగ్.

Kiccha Sudeep recieved threating letter do not join in BJP
Kiccha Sudeep : కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ గత ఏడాది ‘విక్రాంత్ రోణ’ (Vikrant Rona) సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం రిలీజ్ అయ్యి 9 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు సుదీప్ మరో సినిమా ప్రకటించలేదు. ఇది ఇలా ఉంటే, ఇటీవల సుదీప్.. తాను BJP పార్టీ తరుపున ప్రచారం చేస్తాను అంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సుదీప్ నిర్ణయం కర్ణాటకలో తీవ్ర దుమారాన్ని లేపుతుంది. ఎన్నికలు పూర్తి అయ్యేవరకు సుదీప్ సినిమాలు బ్యాన్ చేయాలంటూ కూడా కోర్ట్ లో పిటిషన్ దాఖలైంది.
Kichha Sudeep : బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ.. విరాట్ కోహ్లీ ఫామ్ లాంటిది..
తాజాగా సుదీప్ కి బెదిరింపు లేఖ కూడా వచ్చింది. ‘బీజేపీలో చెరితే నీ ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు ప్రజలందరి ముందు బహిర్గతం చేస్తాను’ అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. ఇక లేఖని చూసిన సుదీప్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. కాగా సుదీప్ కారు డ్రైవరే ఈ పని చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఆ డ్రైవర్ కూడా ఫోన్ స్విచాఫ్ చేసుకొని పరారీలో ఉండడంతో అతడి పై అనుమానం మరింత బలపడుతుంది.
Sudeep : బ్రేక్ తీసుకోలే.. వచ్చింది అంటున్న కిచ్చా సుదీప్.. కొత్త ప్రాజెక్ట్స్ అప్డేట్!
ఇటీవలే సుదీప్ ఆ డ్రైవర్ ని ఉద్యోగంలో నుంచి తీసేశాడట. దీంతో అతడే కక్ష్య పెంచుకొని ఇదంతా చేసి ఉండవచ్చని సుదీప్ ఇంటి సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుదీప్ కూడా తనకి సంబంధించిన ప్రైవేట్ వీడియో అతడి దగ్గర ఉండే అవకాశం ఉందంటూ అనుమానం వ్యక్తం చేశాడు. అయితే నిజంగానే సుదీప్ ప్రైవేట్ వీడియోలు డ్రైవర్ దగ్గర ఉన్నాయా? అనేది కన్నడనాట చర్చనీయాంశంగా మారింది. అయితే ఇది రాజకీయ వ్యక్తుల పని? లేదా డ్రైవర్ సొంత కక్షా? తెలియాలి అంటే అతను దొరకాల్సిందే.