Meter Movie: ట్రైలర్‌తో ‘మీటర్’ను మరింత పెంచేందుకు రెడీ అయిన కిరణ్ అబ్బవరం
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘మీటర్’ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ చిత్ర ట్రైలర్ ను మార్చి 29న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేయడంతో, ఈ ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Kiran Abbavaram Meter Movie Trailer Release Date Locked
Meter Movie: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. కేవలం సినిమాలు చేయడమే కాకుండా, వాటిని ప్రేక్షకులు మెచ్చే విధంగా మలచడంలో ఈ హీరోకు మంచి పేరుంది. ఇటీవల ‘వినరో భాగ్యము విష్ణు కథ’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్ అబ్బవరం, బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో ఇప్పుడు తన నెక్ట్స్ మూవీని కూడా రిలీజ్‌కు రెడీ చేశాడు.
‘మీటర్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో తెరకెక్కిన ఈ పక్కా కాప్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో కిరణ్ అబ్బవరం తొలిసారి కాప్‌గా కనిపిస్తున్నాడు. ఈ చిత్ర పోస్టర్స్, టీజర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. అయితే, తాజాగా ఈ సినిమా నుండి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ను చిత్ర యూనిట్ ఇచ్చింది. ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. మీటర్ మూవీ ట్రైలర్‌ను మార్చి 29న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.
Meter Movie Teaser: టీజర్ టాక్.. పొగరుతో నడిచే మాస్ ‘మీటర్’ను పట్టుకొస్తున్న కిరణ్ అబ్బవరం
ఇక ఈ సినిమాను రమేష్ కాడూరి డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకునేందుకు కిరణ్ అబ్బవరం రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో అందాల భామ అతుల్యా రవి హీరోయిన్‌గా నటిస్తోండగా, సాయి కార్తీక్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. మరి మీటర్ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో తెలియాలంటే మార్చి 29 వరకు వెయిట్ చేయాల్సిందే.