Kiran Abbavaram: ‘మీటర్’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన కిరణ్ అబ్బవరం

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రీసెంట్‌గా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాను పూర్తి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కించగా, ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు తన నెక్ట్స్ చిత్రాన్ని కూడా రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు ఈ యంగ్ హీరో.

Kiran Abbavaram: ‘మీటర్’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన కిరణ్ అబ్బవరం

Kiran Abbavaram Meter Teaser Release Time Locked

Kiran Abbavaram: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రీసెంట్‌గా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాను పూర్తి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కించగా, ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు తన నెక్ట్స్ చిత్రాన్ని కూడా రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు ఈ యంగ్ హీరో.

Kiran Abbavaram: రావణాసురతో పోటీకి ‘మీటర్’ను రెడీ చేసిన కిరణ్ అబ్బవరం

రమేష్ కాడూరి దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘మీటర్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాలో కిరణ్ తొలిసారి ఓ పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమా యాక్షన్ ఎంటర్‌టైనర్ కథతో రానుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఈ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేయగా, ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను మార్చి 7న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్.

Kiran Abbavaram: మరో సినిమా రిలీజ్ డేట్‌ను వదులుతున్న కిరణ్ అబ్బవరం

తాజాగా ఈ టీజర్‌ను రిలీజ్ చేసే టైమ్‌ను కూడా ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. మీటర్ చిత్ర టీజర్‌ను మార్చి 7న సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. దీంతో ఈ సినిమా టీజర్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు. ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా, వేసవి కానుకగా ఏప్రిల్ 7న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.