Patang : గాలిపటాలతో కామెడీ స్పోర్ట్స్ డ్రామా.. ‘పతంగ్’ మూవీ రిలీజ్ ఎప్పుడంటే..

తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు.

Patang : గాలిపటాలతో కామెడీ స్పోర్ట్స్ డ్రామా.. ‘పతంగ్’ మూవీ రిలీజ్ ఎప్పుడంటే..

Kite Sports Drama Patang Movie Release Date Announced

Updated On : October 16, 2024 / 7:08 AM IST

Patang : ఇప్పటి వరకు తెలుగులో చాలా స్పోర్ట్స్ డ్రామాలు వచ్చాయి. కాని గాలిపటాల స్పోర్ట్స్ డ్రామాతో ‘పతంగ్’ అనే సినిమా రాబోతుంది. రిష‌న్ సినిమాస్ బ్యానర్ పై విజ‌య్ శేఖ‌ర్ అన్నే, సంప‌త్ మ‌క, సురేష్ కొత్తింటి నిర్మాణంలో ప్ర‌ణీత్ ప్ర‌త్తిపాటి దర్శకత్వంలో ఈ పతంగ్ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ప్రీతి ప‌గ‌డాల‌, ప్ర‌ణ‌వ్ కౌశిక్‌, వంశీ పూజిత్ మెయిన్ లీడ్స్ లో నటిస్తుండగా ప్ర‌ముఖ సింగ‌ర్ ఎస్‌పీ చ‌ర‌ణ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

Also Read : Love Reddy : ‘లవ్ రెడ్డి’ ట్రైలర్ చూశారా..? టైటిల్, ట్రైలర్ భలే ఉన్నాయే..

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఆల్రెడీ ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి నెలకొల్పారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. పతంగ్ సినిమా డిసెంబరు 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

Kite Sports Drama Patang Movie Release Date Announced

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ఈ సినిమా థియేటర్స్ లో యూత్‌ ఫెస్టివల్‌లా ఉంటుంది. సినిమా కొత్తగా ఉంటుంది అలాగే మంచి క్వాలిటీ ఉంటుంది. పతంగ్ సినిమా అన్ని రకాల ప్రేక్షకులకు నచ్చుతుంది. డిసెంబర్ 27న ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాం అని తెలిపారు.