Krishna Sai : పేద మహిళలకు 50 వేల ఆర్ధిక సహాయం చేసిన హీరో కృష్ణసాయి..

కుల, మత, ప్రాంతాలకు అతీతంగా కృష్ణ సాయి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అభాగ్యలకు అండగా ఉంటున్నారు. సుందరాంగుడు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన కృష్ణ సాయి.. తనవంతు బాధ్యతగా అవసరార్ధులకు అపద్భాందవుడై ఆదుకుంటున్నాడు.

Krishna Sai : పేద మహిళలకు 50 వేల ఆర్ధిక సహాయం చేసిన హీరో కృష్ణసాయి..

Krishna Sai Actor helped 50 Thousand to Poor Women in Palnadu District

Updated On : September 13, 2023 / 1:37 PM IST

Krishna Sai : వెండితెరపై నాలుగు పైట్లు, ఆరు పాటలు చేసి హీరో అనిపించుకున్నవాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ ఆయన రీల్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోను హీరో అనిపించుకుంటున్నాడు. అలా అని ఆయనకు ఇండస్ట్రీలో ఏ బ్యాక్ గ్రౌండ్ లేదు. ఒంటరిగా వచ్చి అందరివాడు అనిపించుకుంటున్నాడు. తెలుగు రాష్ట్రాలలో ఏ మూలన తన అవసరమున్న తనవంతు బాధ్యతగా సహాయం చేస్తున్నాడు. ‘ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న’ అన్న మథర్ థెరిసా మాటల ప్రేరణతో ఎన్నో సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు హీరో కృష్ణ సాయి.

కుల, మత, ప్రాంతాలకు అతీతంగా కృష్ణ సాయి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అభాగ్యలకు అండగా ఉంటున్నారు. సుందరాంగుడు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన కృష్ణ సాయి.. తనవంతు బాధ్యతగా అవసరార్ధులకు అపద్భాందవుడై ఆదుకుంటున్నాడు. ఇప్పటికే పలు సేవకార్యక్రమాలతో పలువురు ప్రముఖుల ప్రశంసలు అందుకున్న హీరో కృష్ణ సాయి తాజాగా పల్నాడు జిల్లా కారెంపూడి మండలం పామిడిపాడు గ్రామంలో పేద మహిళలకు 50 వేల రూపాయల ఆర్ధిక సాయం చేశారు.

Bigg Boss : బిగ్‌బాస్ హౌస్‌లో ఆ వాయిస్ ఎవరిది? బిగ్‌బాస్‌లా మాట్లాడే పర్సన్ ఎవరో తెలుసా?

అవసరమైన మహిళలకు ఆర్ధిక సహాయం చేశారు కృష్ణసాయి. అంతేకాకుండా అవసరమైతే భవిష్యత్తులో ఆ గ్రామ మహిళలకు తన ట్రస్ట్ ద్వారా సాయం చేస్తానని చెప్పారు. కృష్ణ సాయి తన ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవలను పలువురు ప్రశంసిస్తున్నారు. ‘సుందరాంగుడు’ సినిమాలో హీరోగా నటించిన కృష్ణ సాయి.. ప్రస్తుతం ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలింస్‌ పతాకంపై పీఎస్‌ నారాయణ దర్శకత్వంలో కొత్త చిత్రం ‘జ్యువెల్‌ థీఫ్‌'(నగల దొంగ)లో నటించబోతున్నట్లు హీరో కృష్ణసాయి తెలిపారు.