కృష్ణవంశీ ‘రంగమార్తాండ’
ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ జంటగా ‘రంగమార్తాండ’ అనే చిత్రాన్ని రూపొందించనున్నారు కృష్ణవంశీ.. ‘నటసామ్రాట్’ అనే మరాఠీ సినిమాకు ‘రంగమార్తాండ’ అఫీషియల్ రీమేక్..

ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ జంటగా ‘రంగమార్తాండ’ అనే చిత్రాన్ని రూపొందించనున్నారు కృష్ణవంశీ.. ‘నటసామ్రాట్’ అనే మరాఠీ సినిమాకు ‘రంగమార్తాండ’ అఫీషియల్ రీమేక్..
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ సినిమా అంటే ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారు. ‘చందమామ’ తర్వాత ఆయన నుండి సరైన సినిమా రాలేదు. ‘నక్షత్రం’ తర్వాత కృష్ణవంశీ సినిమా ఏంటి? అనే ఆసక్తి ప్రేక్షకుల్లోనూ, ఇండస్ట్రీలోనూ బాగా ఉంది. ఆయన నెక్ట్స్ సినిమాను రీసెంట్‌గా ప్రకటించారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ జంటగా ‘రంగమార్తాండ’ అనే చిత్రాన్ని రూపొందించనున్నారు కృష్ణవంశీ.
రెడ్ బల్బ్ మూవీస్, ఎస్‌విఆర్ గ్రూప్, హౌస్‌ఫుల్ మూవీస్ బ్యానర్స్‌పై.. అభిషేక్ జవ్‌కర్, మధు కలిపు నిర్మించనున్నారు. ఈ సినిమా ‘నటసామ్రాట్’ అనే మరాఠీ సినిమాకు ‘రంగమార్తాండ’ అఫీషియల్ రీమేక్. ‘నటసామ్రాట్’ సినిమాను ప్రముఖ బాలీవుడ్ నటుడు, తెలుగులో ‘ఒక్కడున్నాడు’, ‘హోమం’, ‘అదుర్స్’, ‘డాన్ శీను’,‘గుంటూరు టాకీస్’, ‘సాహో’ వంటి సినిమాలలో నటించిన మహేష్ మంజ్రేకర్ డైరెక్ట్ చెయ్యగా.. ‘వెర్సటైల్ యాక్టర్’ నానా పటేకర్ ప్రధాన పాత్రలో నటించారు.
Read Also : ‘సైరా’ అందరూ చూడదగిన చిత్రం : వెంకయ్యనాయుడు
త్వరలోనే ‘రంగమార్తాండ’ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. 2004లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీ ఆంజనేయం’ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్ర చేశారు. అంటే.. 15 ఏళ్ల తర్వాత మళ్లీ భర్త దర్శకత్వంలో రమ్యకృష్ణ యాక్ట్ చేయబోతున్నారు. అప్పుడు గెస్ట్ రోల్ చేసిన రమ్యకృష్ణ ఇప్పుడు కథానాయిక పాత్ర చెయ్యనుండడం విశేషం. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.
S ……. Thank u Taran Adarsh ji .. https://t.co/IWEITNSdpb
— Krishna Vamsi (@director_kv) October 16, 2019