Krishnam Raju: రాధేశ్యామ్ నుంచి కృష్ణంరాజు ఫస్ట్ లుక్..!

Krishnam Raju as Paramahamsa from Radhe Shyam

Krishnam Raju: రాధేశ్యామ్ నుంచి కృష్ణంరాజు ఫస్ట్ లుక్..!

Krishnam Raju

Updated On : December 20, 2021 / 9:52 PM IST

Krishnam Raju: ప్యాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రాధేశ్యామ్’. సీనియర్ హీరో, ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ఈ సినిమాలో ముఖ్యమైన రోల్‌లో నటిస్తున్నారు.

ఆధ్యాత్మిక గురువు ‘పరమహంస’గా కనిపించబోతున్నారు కృష్ణంరాజు. ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ని చిత్రయూనిట్ లేటెస్ట్‌గా విడుదల చేసింది. కాషాయ దుస్తుల్లో ప్రసన్న వదనంతో రుద్రాక్ష చేతబూని కృష్ణంరాజు ఆధ్యాత్మిక రూపంలో కనిపిస్తున్నారు కృష్ణంరాజు.

పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ నిర్మించాయి. ఈ సినిమా 2022 జనవరి 14న సంక్రాంతి సంధర్భంగా విడుదలకు సిద్ధం అవుతోంది.