Krishnam Raju : నేడు మధ్యాహ్నం కృష్ణంరాజు అంత్యక్రియలు.. అధికారలాంఛనాలతో..

హీరో కృష్ణంరాజు అంత్యక్రియలు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామంలో అయన ఫామ్ హౌస్ లో జరగనున్నాయి. నేడు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కృష్ణం రాజు ఇంటివద్ద నుంచి............

Krishnam Raju : నేడు మధ్యాహ్నం కృష్ణంరాజు అంత్యక్రియలు.. అధికారలాంఛనాలతో..

Krishnamraju last rites will be held with state honours

Updated On : September 12, 2022 / 1:19 PM IST

Kriahnam Raju :  నటుడు, రెబల్ స్టార్, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు ఆదివారం ఉదయం అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మరణం టాలీవుడ్ లో విషాదం మిగిల్చింది. ప్రభాస్ కి తీరని లోటుని ఏర్పరిచింది. సినీ, రాజకీయ ప్రముఖులంతా తరలివచ్చి కృష్ణంరాజుకి నివాళులు అర్పించారు. అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం కృష్ణంరాజు గారి పార్థివదేహం జూబ్లీహిల్స్,రోడ్ నెంబర్ 28లోని ఆయన ఇంటి వద్దే నేడు సోమవారం మధ్యాహ్నం వరకు ఉంచబడుతుంది.

Krishnam Raju Death: కృష్ణంరాజు మృతి తీరనిలోటు.. సినీ ప్రముఖుల సంతాపం!

హీరో కృష్ణంరాజు అంత్యక్రియలు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామంలో ఆయన ఫామ్ హౌస్ లో జరగనున్నాయి. నేడు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కృష్ణం రాజు ఇంటివద్ద నుంచి ఆయన పార్థివదేహాన్ని అంతిమయాత్రగా మొయినాబాద్ కి తరలిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు కనకమామిడిలోని ఆయన ఫామ్ హౌస్ లో కృష్ణంరాజు గారి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరగనున్నాయి. ఇప్పటికే ఆ గ్రామ సర్పంచ్ అక్కడ కార్యక్రమాలని పర్యవేక్షిస్తున్నారు.