Krithi Shetty: మాచర్ల నియోజకవర్గంలో కృతి ఎంట్రీ అదిరింది!

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి....

Krithi Shetty: మాచర్ల నియోజకవర్గంలో కృతి ఎంట్రీ అదిరింది!

Krithi Shetty Look Revealed From Macherla Niyojakavargam

Updated On : July 17, 2022 / 6:58 PM IST

Krithi Shetty: యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో నితిన్ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో నితిన్ ఓ పవర్‌ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా, ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యాయి.

Krithi Shetty: బేబమ్మ కోరిక మామూలుగా లేదుగా..?

ఇక ఈ సినిమాలో నితిన్ సరసన అందాల భామలు కృతి శెట్టి, కేథరిన్ త్రేజాలు హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాలో కృతి శెట్టి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రంలో కృతి శెట్టి స్వాతి అనే పాత్రలో నటిస్తోంది. ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో యెల్లో ఔట్‌ఫిట్‌లో గ్లాసెస్ పెట్టుకుని అల్ట్రా స్టైలిష్‌గా కనిపిస్తోంది.

Krithi Shetty : కథ చెప్తే నోట్స్ రాసుకుంటా.. పోలీస్‌ స్టేషన్‌, రేడియో స్టేషన్‌ మధ్యలో ఓ రైల్వే స్టేషన్‌ ఇదే కథ..

కాగా, ఈ సినిమాలో అమ్మడికి అదిరిపోయే పాత్ర లభించిందని, ఆమె పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ అంటోంది. ఇక ఈ సినిమాలో మరో బ్యూటీ కేథరిన్ త్రేజా పాత్ర కూడా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. కాగా, మరో బ్యూటీ అంజలి ఈ సినిమాలో ‘‘రా రా రెడ్డి..’’ అనే ఊరమాస్ పాటలో నితిన్‌తో కలిసి చిందులేస్తోంది. ఇప్పటికే ఈ లిరికల్ సాంగ్ రిలీజ్ కాగా, ప్రేక్షకులు ఈ పాటను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మరి కృతి శెట్టి మాచర్ల నియోజకవర్గంలో ఏం చేస్తుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ చిత్రాన్ని ఆగస్టు 12న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.