Krithi Shetty : కృతి శెట్టిని అంత మాట అన్నా స్పోర్టివ్‌గా తీసుకుంది.. వావ్
సినిమా తారలు ఒక్కోసారి అభిమానుల నుండి ఇబ్బందికర ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అన్నింటినీ ఫేస్ చేస్తూ చిరునవ్వులు చిందిస్తుంటారు. ఓ అభిమాని ప్రశ్నకు హీరోయిన్ కృతి శెట్టి ఎలా స్పందించిందంటే?

Krithi Shetty
Krithi Shetty : ‘ఉప్పెన’ సినిమాలో బేబమ్మగా కృతి శెట్టి మంచి మార్కులు కొట్టేసారు. ఆ తర్వాత చేసిన సినిమాలు ఎందుకో పెద్దగా కలిసి రాలేదు. రీసెంట్‌గా కృతి ఓ షాప్ ఓపెనింగ్‌లో పాల్గొన్నప్పుడు అభిమాని నుండి ఎదురైన కామెంట్‌కి ఏ మాత్రం ఫీల్ కాకుండా స్పోర్టివ్‌గా తీసుకున్నారు. ఆ వీడియో వైరల్ అవుతోంది.
Little Miss Naina : #90s సిరీస్ తర్వాత మరో కొత్త సినిమా.. ఈసారి పొట్టి పొడుగు కాన్సెప్ట్‌తో..
కృతి శెట్టి ఉప్పెన సినిమా తర్వాత వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ వంటి సినిమాలు చేసారు. ఇవన్నీ యావరేజ్‌గా ఆడాయి. తెలుగులో మళ్లీ మంచి బ్రేక్ కోసం చూస్తున్నారు కృతి. ఇదిలా ఉంటే రీసెంట్‌గా ఓ చీరల షాపు ఓపెనింగ్‌కి వెళ్లిన కృతికి ఫ్యాన్ నుండి వెరైటీ ప్రశ్న ఎదురైంది. ఓ అభిమాని కృతిని చూసిన ఎగ్జైంట్మెంట్‌లో ‘స్కంద’ సినిమా సూపరుంది.. అంటూ పొగడ్తలు కురిపించాడు. ‘సూపరుందా?’ అని నవ్వుతూ ‘నేను లేను దాంట్లో అని’ కృతి సమాధానం చెప్పారు. ఇంకెవరైనా హీరోయిన్స్ అయితే కాస్త ఫీలయ్యేవారేమో కృతి మాత్రం ఇంత ఈజీగా తీసుకోవడం ఆశ్చర్యపరిచింది. నిజానికి స్కంద మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటించారు.
Shobha Shetty : పెళ్లి తాంబూలాలు వీడియో షేర్ చేసిన బిగ్‌బాస్ ఫేమ్ శోభాశెట్టి..
కృతి శెట్టి ప్రస్తుతం వా వాతియారే, లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, జెనీ అనే మూడు తమిళ సినిమాలు చేస్తున్నారు. తెలుగులో శర్వానంద్ సినిమా ‘శర్వా35’ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ సినిమాలు కృతి శెట్టికి కలిసి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
??? pic.twitter.com/juPnazSC3l
— T o M m Y ツ (@rakesh_tarakian) January 25, 2024