KTR : కేటీఆర్ రిలీజ్ చేసిన ‘షరతులు వర్తిస్తాయి’ సాంగ్.. ‘తురుమై వచ్చేయ్..’ అంటూ..

షరతులు వర్తిస్తాయి సినిమా నుంచి ఓ మోటివేషనల్ సాంగ్ ని కేటీఆర్ రిలీజ్ చేశారు.

KTR : కేటీఆర్ రిలీజ్ చేసిన ‘షరతులు వర్తిస్తాయి’ సాంగ్.. ‘తురుమై వచ్చేయ్..’ అంటూ..

KTR Released Thurumai Vachchey Lyrical Song from Chaitanya Rao Sharathulu Varthisthai Movie

Sharathulu Varthisthai : చైతన్య రావు(Chaitanya Rao), భూమి శెట్టి జంట‌గా కుమార‌స్వామి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన సినిమా ‘ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి’. స్టార్ లైట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నాగార్జున సామ‌ల‌, శ్రీష్ కుమార్ గుండా, డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ చిత్త‌జ‌ల్లు ఈ సినిమాని నిర్మించారు. షరతులు వర్తిస్తాయి సినిమా మార్చ్ 15న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే సినిమా నుంచి టీజర్, ట్రైలర్, సాంగ్స్ రాగా సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీల కథ అంటూ ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాని తెలంగాణ నేటివిటీతో తెరకెక్కించడం విశేషం.

తాజాగా నిన్న రాత్రి షరతులు వర్తిస్తాయి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా జరిగింది. అలాగే ఈ సినిమా నుంచి ‘తురుమై వచ్చేయ్.. మెరుపై తెచ్చేయ్..’ అంటూ సాగిన పాటని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ని మాజీ మంత్రి కేటీఆర్ రిలీజ్ చేశారు. ఈ పాటని పసునూరి రవీందర్ రాయగా అరుణ్ చిలువేరు సంగీత దర్శకత్వంలో ఎంఎల్ఆర్ కార్తికేయన్ పాడారు. ఈ పాట స్ఫూర్తి నింపే పాటలా ఉంది. ఆ పాట మీరు కూడా వినేయండి.

Also Read : Vishwak Sen : మొన్న ‘గుంటూరు కారం’, ఇవాళ ‘గామి’.. విశ్వక్ సేన్ సంచలన పోస్ట్.. ఆ ఇష్యూపై లీగల్ గా పోరాడతా..

సాంగ్ రిలీజ్ అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి సినిమా పోస్టర్స్, సాంగ్స్ చూశాను. కంటెంట్ చాలా బాగుంది. కరీంనగర్ నేపథ్యంలో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. తెలంగాణ నేపథ్యంలో మరిన్ని సినిమాలు రావాలి. ఈ సినిమా మంచి విజయం సాధించాలని మూవీ యూనిట్ కి ఆల్ ది బెస్ట్ తెలిపారు.

KTR Released Thurumai Vachchey Lyrical Song from Chaitanya Rao Sharathulu Varthisthai Movie