Bigg Boss 5 Telugu : ప్రియ, రవిల వల్ల లహరి బలైందా..?

రవి, ప్రియల కారణంగా లహరి ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి ఎలిమినేట్ కావాల్సి వచ్చిందా..

Bigg Boss 5 Telugu : ప్రియ, రవిల వల్ల లహరి బలైందా..?

Lahari

Updated On : September 26, 2021 / 2:39 PM IST

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 గత రెండు వారాలుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ.. మూడో వారంలోకి ఎంటర్ అయ్యింది. కింగ్ నాగార్జున తన స్టైల్‌లో హోస్ట్ చేస్తూ.. అవసరమైనప్పుడు కంటెస్టంట్లకు క్లాస్ పీకుతున్నారు.

Bigg Boss 5 Telugu : ప్రియ కామెంట్స్‌పై రవి భార్య రియాక్షన్.. ఫ్యాన్స్ ఏమంటున్నారంటే..

ఇక మొదటివారం సెవన్ ఆర్ట్స్ సరయు, రెండో వారం క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉమా దేవి ఎలిమినేట్ అయ్యారు. మూడో వారం నామినేషన్స్‌లో ప్రియ, లహరి, మానస్, ప్రియాంక సింగ్, శ్రీ రామ చంద్ర ఉన్నారు. వీరిలో మానస్, శ్రీ రామ చంద్ర అత్యధిక ఓట్లతో ముందంజలో ఉన్నారని తెలుస్తోంది. ప్రియాంక కూడా మంచి ఓట్లే తెచ్చుకుందట. మానస్, శ్రీ రామ చంద్ర, ప్రియాంకలకు హౌస్‌లో మంచి స్క్రీన్ స్పేస్‌ దొరికింది. ఎలాంటి నెగెటివిటీ లేకపోవడంతో వీళ్లు ముగ్గురూ సేఫ్ జోన్‌లో ఉన్నారని సమాచారం.

Bigg Boss 5 Telugu : రవి నిజ స్వరూపం బయట పెట్టిన నాగార్జున..

ఇక మిగిలింది ప్రియ అండ్ లహరి.. అసలు ప్రియ నామినేషన్స్‌లోకి వచ్చిన రోజే ఎలిమినేట్ అయిపోతుంది అనుకున్నారంతా. రవి, లహరి గురించి తప్పుగా మాట్లాడడంతో ప్రియ మీద నెగెటివిటీ పెరిగిపోయింది. కట్ చేస్తే.. రవి, లహరి గురించి మాట్లాడిన వీడియో నాగార్జున బయట పెట్టడంతో ప్రియపై ఉన్న నెగెటివిటీ అంతా రవి మీదకు మళ్లింది. ప్రియ, రవి చేసిన పనులకు లహరి బలి కావాల్సి వచ్చిందని, ఈ వారం ఆమె ఎలిమినేట్ అయ్యిందంటూ నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి.

Kajal Aggarwal : నాగ్ సినిమా క్యాన్సిల్.. కాజల్ కన్ఫమ్ చేసేసిందా..?