Lakshmi Manchu: చీరకట్టులో దుమ్ము దులిపేసిన మంచు లక్ష్మి!

పాజిటివ్.. నెగటివ్.. రెస్పాన్స్ ఏదైనా డోంట్ కేర్ అంటూ దూసుకెళ్లడం మంచు వారి ఆడపడుచు స్టైల్. నాలుగుపదుల వయసు దాటినా చిన్న పిల్లలా మాట్లాడుతూ అప్పుడప్పుడు నెగటివ్ కామెంట్స్ మూటగట్టుకొనే లక్ష్మి అప్పుడప్పుడు మంచి పనులు చేస్తూ తన మనసును చాటుకుంటారు.

Lakshmi Manchu: చీరకట్టులో దుమ్ము దులిపేసిన మంచు లక్ష్మి!

Lakshmi Manchu Mass Dance In Saree Viral On Social Media

Updated On : June 22, 2021 / 12:59 PM IST

Lakshmi Manchu: పాజిటివ్.. నెగటివ్.. రెస్పాన్స్ ఏదైనా డోంట్ కేర్ అంటూ దూసుకెళ్లడం మంచు వారి ఆడపడుచు స్టైల్. నాలుగుపదుల వయసు దాటినా చిన్న పిల్లలా మాట్లాడుతూ అప్పుడప్పుడు నెగటివ్ కామెంట్స్ మూటగట్టుకొనే లక్ష్మి అప్పుడప్పుడు మంచి పనులు చేస్తూ తన మనసును చాటుకుంటారు. డ్రెస్సింగ్ నుండి సోషల్ మీడియా వరకు కామెంట్స్ చేసినా.. విమర్శించినా ఏ మాత్రం లెక్కచేయని లక్ష్మి తనపని తాను చేసుకుపోతుంటారు. కాగా.. ఇప్పుడు చీరకట్టులో మాస్ డాన్స్ చేస్తూ మరోసారి సోషల్ మీడియాలో దుమారం రేపారు.

నిన్న ప్రపంచమంతా యోగా డేలో ఉంటే లక్ష్మి మాత్రం చీరకట్టి మాస్ డాన్స్ చేసి.. ఆ వీడియో తెచ్చి సోషల్ మీడియాలో పెట్టి అటెన్షన్ క్రియేట్ చేశారు. చీరకట్టులో మాస్ డాన్స్ వేస్తూ ఉర్రూతలూగించిన లక్ష్మి.. ‘ఎవరూ చూడటం లేదని తెలిసినప్పుడు.. డాన్స్ చేస్తే పిచ్చ క్రేజ్’ అంటూ ఆ వీడియోకి అదిరిపోయే క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోలో ఆమె కూతురు విద్యా నిర్వాణ కూడా తల్లితో జతకలిసి మాస్ స్టెప్పులు వేయగా ఈ తల్లి కూతుళ్ళ డాన్స్ యమా క్రేజీగా ఉంది.

అయితే.. చీరకట్టులో రెచ్చిపోయిన ఈ డాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా ఎప్పటిలానే లక్ష్మి డాన్స్ మీద మిక్సెడ్ కామెంట్స్ వస్తున్నాయి. కొందరు లక్ష్మి డాన్స్ సూపర్బ్ అంటుంటే.. మరికొందరు రికార్డింగ్ డాన్స్ అవసరమా అంటూ నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక.. లక్ష్మి డియెరెస్ట్ ఫ్రెండ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ వీడియోకు లైక్ చేయగా మరికొందరు సెలబ్రిటీలు లక్ష్మి డాన్స్ ను తెగమెచ్చుకుంటున్నారు.