Heroine Lavanya Tripathi : లావణ్య త్రిపాఠికి చేదు అనుభవం

లావణ్య త్రిపాఠి.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు.. అందాల రాక్షసి సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన లావణ్య ఆమె నటనతో మంచి పేరు తెచ్చుకున్నారు. తొలి సినిమాతోనే హీరోయిన్ గా సత్తా చాటారు. ఈ సినిమా హిట్ తో తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలు వచ్చిపడ్డాయి.

Heroine Lavanya Tripathi : లావణ్య త్రిపాఠికి చేదు అనుభవం

Lavanya Tripati

Updated On : July 23, 2021 / 5:50 PM IST

Heroine Lavanya Tripathi : లావణ్య త్రిపాఠి.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు.. అందాల రాక్షసి సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన లావణ్య ఆమె నటనతో మంచి పేరు తెచ్చుకున్నారు. తొలి సినిమాతోనే హీరోయిన్ గా సత్తా చాటారు. ఈ సినిమా హిట్ తో తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలు వచ్చిపడ్డాయి.

ప్రస్తుతం లావణ్య త్రిపాఠి “రాయబారి” అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం వెళ్లేందుకు సిద్దమవుతున్న సమయంలో చేదు అనుభవం ఎదురైంది. షూటింగ్‌ కోసం వేరే ప్రాంతానికి వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారు లావణ్య. అయితే తాను టికెట్ బుక్ చేసుకున్న ఫ్లైట్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ నేపథ్యంలోనే విమానయాన సంస్థ ఫ్లైట్ క్యాన్సల్ చేసింది.

దీంతో సదరు విమానయాన సంస్థ ఎయిర్ ఏషియాను సోషల్‌ మీడియాలో ట్యాగ్‌ చేస్తూ ఫ్లైట్ క్యాన్సిల్‌ అవుతుందన్న విషయం ముందుగా ఎందుకు తెలియజేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఫ్లైట్‌ క్యాన్సిల్‌ అని మెసేజ్‌ రావడం ఏంటని ఫైర్ అయ్యారు. ఇలాంటిది గతంలో ఎవరికైనా జరిగిందా? లేక తనకే ఇలా అయిందా అంటూ ఫ్యాన్స్‌ను అడిగారు లావణ్య. కాగా ఆమె పోస్ట్ పై కొందరు ఫన్నీగా స్పందిస్తే, మరికొందరు మాత్రం ఫ్లైట్ ఏజెన్సీని తిట్టిపోస్తున్నారు.