Lookback Entertainment : ఈ ఇయర్ కేసులు ఎదుర్కొన్న సెలబ్రిటీస్ వీళ్లే..

టాలీవుడ్ సినీ సెలబ్రిటీస్ తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటుంటారు.

Lookback Entertainment : ఈ ఇయర్ కేసులు ఎదుర్కొన్న సెలబ్రిటీస్ వీళ్లే..

Lookback Entertainment Celebrities Who had Facing Cases in 2024

Updated On : December 19, 2024 / 4:01 PM IST

Lookback Entertainment : టాలీవుడ్ సినీ సెలబ్రిటీస్ తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటుంటారు. పోలీసు స్టేషన్స్ వరకు వెళుతుంటారు. ఇక ఈ ఏడాది పలువురు సినీ సెలబ్రిటీస్ కూడా కొన్ని వివాదాల్లో చిక్కుకున్నారు. వారు ఎవరు.. ఎలా.. అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ ఏడాది టాలీవడ్ సినీ ఇండస్ట్రీలో ఎక్కువ మారుమోగిన పేరు ఎవరిది.. అంటే అది హీరో రాజ్ తరుణ్ అని చెప్పాలి.

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా మంచిపేరు తెచ్చుకున్నాడు నటుడు రాజ్ తరుణ్. రాజ్‌ తరుణ్‌ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వదిలేసి వెళ్లిపోయాడని లావణ్య అనే అమ్మాయి నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తనని గర్భవతి చేసాడని, చాలా మంది అమ్మాయిలతో ఎఫైర్ నడిపాడని. తనని ఎవ్వరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నాడని అనేక ఆరోపణలు వేసింది. కొన్ని రోజుల వీరి కేసు నడిచినప్పటికీ ఇప్పటికి చల్లబడింది.

Also Read : Manchu Vishnu : ‘తప్పే’.. నేను ఉండుంటే ఇలా జరిగేది కాదు.. మంచు విష్ణు

రాజ్ తరుణ్ కేసు తర్వాత టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసింది ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు..

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాప్ డాన్స్ కొరియోగ్రాఫర్ లలో ముందువరుసలో ఉంటాడు జానీ మాస్టర్. ఎన్నో సినిమాలకి డాన్స్ కొరియోగ్రాఫర్ గా ఉన్న ఈయన తన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేస్తున్న ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసాడని, తనని ట్రాప్ చేసాడని ఆరోపణలు చేసి జానీ మాస్టర్ పై కేసు నమోదు చేసింది. ఇందుకుగాను జానీ మాస్టర్ కొన్ని రోజులు జైల్లో ఉండి ఇటీవల బయటికి వచ్చారు.

జానీ మాస్టర్ తర్వాత కన్నడ నటుడు దర్శన్.. ఏకంగా ఒక వ్యక్తిని హత్య చేసాడు.

రేణుకాస్వామి అనే వ్యక్తి దర్శన్‌ అభిమాని. అతడు నటి పవిత్రా గౌడతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు వస్తున్న వార్తలను నమ్మి తన పేరుప్రతిష్టలు పోతాయని అనుకున్నాడుఅ. దీంతో ఒక నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను ఓపెన్ చేసి పవిత్రకు అసభ్యకరమైన మెస్సేజ్‌లు పంపి వేధించేవాడు. దీంతో పవిత్ర ఈ విషయాన్ని దర్శన్‌కు చెప్పింది. తన ప్రియురాలిని వేధిస్తున్న రేణుకా స్వామిపై కోపంతో దర్శన్‌ కొందరు రౌడీలను పెట్టి ఆయన్ని హత్య చేయించాడు. తన పేరు బయటికి రాకుండా ఎంత ప్లాన్ చేసినా చివరికి దొంగ దొరికాడు. దాంతో ఆయన్ని జైల్లో పెట్టారు.