Love Story : జాతరను తలపిస్తున్న థియేటర్లు..

తెలుగు ప్రేక్షకులు మంచి సినిమా ఎప్పుడొచ్చినా ఆదరిస్తారనే మాటను మరోసారి నిజం చేసి చూపించారు..

Love Story : జాతరను తలపిస్తున్న థియేటర్లు..

Love Story

Updated On : September 24, 2021 / 3:32 PM IST

Love Story: యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి ఇద్దరూ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. విజువల్స్, పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. శేఖర్ కమ్ముల కథ, కథనం, దర్శకత్వ ప్రతిభతో ఆకట్టుకున్నారు. ‘లవ్ స్టోరీ’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ని కూడా ఆకట్టుకుంటుంది. అందరూ తప్పకుండా థియేటర్లలో చూడాల్సిన సినిమా ఇది అంటున్నారు. ‘లవ్ స్టోరీ’ మూవీ చూసిన వాళ్లు.

Love Story Review : ‘లవ్ స్టోరీ’ రివ్యూ..

కోవిడ్ ఎఫెక్ట్.. రిలీజ్ పలుసార్లు వాయిదా.. ఓటీటీలో రిలీజ్ అంటూ వార్తలు.. ఎన్నో అడ్డంకులను దాటి సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘లవ్ స్టోరీ’.. పాండమిక్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అలాగే ఓవర్సీస్‌లోనూ భారీ అంచనాల మధ్య థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

Mahesh Babu House : ఇంటి కోసం అన్ని కోట్లా..!

ఇప్పుడిప్పుడే థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకుంటున్నాయి.. ఎంత వరకు ప్రేక్షకులు థియేటర్‌కి వచ్చి సినిమాలు చూస్తారు అనే ఆలోచనలో నిర్మాతలు ఉండగా.. తెలుగు ప్రేక్షకులు మంచి సినిమా ఎప్పుడొచ్చినా ఆదరిస్తారనే మాటను మరోసారి నిజం చేసి చూపించారు. మల్టీప్లెక్సులు, సింగిల్ థియేటర్లు అన్న తేడా లేకుండా భారీగా థియేటర్లకు తరలి వస్తున్నారు. మొత్తానికి ‘లవ్ స్టోరీ’ ని మ్యాజికల్ బ్లాక్‌బస్టర్ చేసేశారు అక్కినేని ఫ్యాన్స్ అండ్ తెలుగు ఆడియన్స్.