‘కింగ్’ నాగార్జునకు బ్యూటిఫుల్ బర్త్‌డే గిఫ్ట్..

  • Published By: sekhar ,Published On : August 29, 2020 / 03:57 PM IST
‘కింగ్’ నాగార్జునకు బ్యూటిఫుల్ బర్త్‌డే గిఫ్ట్..

Updated On : August 29, 2020 / 4:29 PM IST

Love Story team wishes to Nagarjuna: యువ సామ్రాట్ నాగ చైతన్య , సాయి పల్లవి జంటగా సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న మూవీ ‘‘లవ్ స్టోరీ’’. ఏమిగోస్  క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వరసినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు.



ఈ రోజు కింగ్ నాగార్జున బర్త్ డే సందర్భంగా ‘‘లవ్ స్టోరీ’’ మేకర్స్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ సినిమా నుండి ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో నాగ చైతన్య, సాయి పల్లవి చాలా ప్లజెంట్‌గా హ్యాపీగా కనిపిస్తున్నారు. ఇంకా 15 రోజుల షూటింగ్ మినహా సినిమా అంతా కంప్లీట్ అయింది. పరిస్థితులు అనుకూలించిన తర్వాత షూటింగ్ మొదలు పెట్టి, సరైన సమయంలో మూవీని థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర ముఖ్య పాత్రలుపోషిస్తున్నారు.
https://10tv.in/gun-firing-in-narsingi-ganesh-immersion/
సాంకేతిక నిపుణులు:
సినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్
మ్యూజిక్ : పవన్ సి.హెచ్
సహా నిర్మాత :భాస్కర్ కటకంశెట్టి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఐర్ల నాగేశ్వర రావు
నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్,పి.రామ్మోహన్ రావు
రచన,దర్శకత్వం: శేఖర్ కమ్ముల.