హేమాహేమీలు : ఆంధ్ర ఎన్నికల స్థాయిలో.. మా ఎలక్షన్స్

  • Published By: madhu ,Published On : March 9, 2019 / 10:47 AM IST
హేమాహేమీలు : ఆంధ్ర ఎన్నికల స్థాయిలో.. మా ఎలక్షన్స్

అదో చిన్న ప్రపంచం.. కాకపోతే వేల కోట్ల వ్యాపారం.. అంతకంటే ఎక్కువగా గ్లామర్ ఫీల్డ్. మెగాస్టార్లు, స్టార్లు.. లేడీ సూపర్ స్టార్లు ఇలా ఉంటుంది. అదే తెలుగు సినీ ఇండస్ట్రీ. వీళ్ల కోసం ఓ అసోసియేషన్ ఉంది. అదే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA-మా). ఈసారి ఎన్నికలు వచ్చేశాయి. రెండు ప్యానల్స్ పోటాపోటీగా బరిలోకి దిగాయి. అదే సీనియర్ ఆర్టిస్టులు నరేశ్ – శివాజీరాజా. అసెంబ్లీ ఎన్నికలను మించి మరీ హంగామా సాగుతోంది. పోటాపోటీగా హామీలు కూడా ఇచ్చాయి రెండు ప్యానన్స్.
Read Also : చిరంజీవి బయోపిక్: నాగబాబు ఏం చెప్పాడంటే?

ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి :
మా (మూవీ ఆర్టిస్టు అసోసియేషన్) ఎన్నికలు ఈసారి సాధారణ ఎన్నికల సీన్‌ని తలపిస్తున్నాయి. రాజకీయ పార్టీల మాదిరిగానే.. హామీల ఇస్తున్నారు. ప్యానల్స్ అయితే మేనిఫెస్టోలను రిలీజ్ చేశాయి. ఒకప్పుడు ఫ్రెండ్స్‌గా నరేశ్ – శివాజీరాజా ఇప్పుడు ప్రత్యర్థులుగా మారారు. ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఇవి ఏ స్థాయికి వెళ్లాయి అంటే.. మీడియా ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు. దుమ్మెత్తిపోసుకున్నారు. తిట్టుకున్నారు. సవాళ్లు విసురుకున్నారు. గెలిస్తే వృద్ధ ఆర్టిస్టులకు రూ. 5వేల పెన్షన్ అందిస్తామని నరేష్ హామీనిచ్చారు. అంతేకాకుండా మెడికల్, లైఫ్ ఇన్సూరెన్స్ కల్పిస్తామన్నారు. ఇదే విధంగా శివాజీ రాజా కూడా హామీలిస్తున్నారు.

‘మా’ అధ్యక్షులు శివాజీ రాజా పదవీ కాలం పూర్తికావడంతో ఎన్నికలు అనివార్యం అయ్యాయి. మార్చి 10వ తేదీ ఆదివారం ‘మా’ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు సాధారణ వాతావరణంలో జరగకుండా సాధారణ ఎన్నికల స్థాయిని గుర్తుకు చేయటం విశేషం. శివాజీ రాజా vs  నరేష్‌ వర్గం నువ్వానేనా అన్నట్లు సాగుతున్నాయి. ఎవరికివారి ప్యానల్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. నరేష్ అధ్యక్షుడిగా, రాజశేఖర్ వైస్ ప్రెసిడెంట్‌గా, జనరల్ సెక్రటరీగా జీవిత రాజశేఖర్‌లు ‘మా’ ఎన్నికలకు నామినేషన్లు వేశారు. శివాజీ రాజాకు శ్రీకాంత్‌తో పాటు ఎస్వీ కృష్ణారెడ్డి, పరుచూరి వెంకటేశ్వరావు, రఘుబాబు వంటి సినీ పెద్దలు సపోర్ట్‌గా నిలిచారు.

800 మందికిపైగా సభ్యులున్న నటీనటుల సంఘానికి మార్చి 10న ఎన్నికలు జరగనున్నాయి. మరి ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడుతారో చూడాలి మరి. 
Read Also : ‘మా’ ఎన్నికలు: రెండు ప్యానల్‌ల సభ్యులు వీళ్లే!