Mad Square : ‘మ్యాడ్ స్క్వేర్’ ఫ‌స్ట్‌డే క‌లెక్ష‌న్ ఎంతంటే..?

శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన మ్యాడ్ స్క్వేర్ చిత్రం తొలి రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంత క‌లెక్ట్ చేసిందంటే..

Mad Square : ‘మ్యాడ్ స్క్వేర్’ ఫ‌స్ట్‌డే క‌లెక్ష‌న్ ఎంతంటే..?

Mad Square first day collections details here

Updated On : March 29, 2025 / 12:07 PM IST

నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం మ్యాడ్ స్క్వేర్. 2023లో వ‌చ్చిన మ్యాడ్ మూవీకి సీక్వెల్‌గా ఈ చిత్రం తెర‌కెక్కింది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. శ్రీకర స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం శుక్ర‌వారం (మార్చి 28న‌) ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అనుదీప్, రెబా మోనికా జాన్, సునీల్, సత్యం రాజేష్,ప్రియాంక జవాల్కర్, అనుదీప్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది.

బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా తొలి రోజు ఈ చిత్రం రూ.20.8 కోట్లకు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఈ విష‌యాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేసింది.

Ram Charan – Dhansuh : వాట్.. రామ్ చరణ్ – ధనుష్ సినిమా..? తమిళ్ – తెలుగు బిగ్గెస్ట్ మల్టీస్టారర్ రాబోతోందా?

సినిమాకి పాజిటివ్ రావ‌డం, కామెడీ ఎంట‌ర్‌టైనర్ కావ‌డంతో నేడు (శ‌నివారం), రేపు (ఆదివారం) ఈ చిత్రం మ‌రిన్ని వ‌సూళ్ల‌ను రాబ‌ట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు సినీ విశ్లేష‌కులు చెబుతున్నారు.

భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.