గిటార్ వాయిస్తూ పాట పాడిన మాధురీ

తన డాన్స్ స్టెప్పులతో ప్రేక్షకుల గుండెల్లో నిలిచిన హీరోయిన్ మాధురీ దీక్షిత్. తేజాబ్‌లో ఏక్, దో, తీన్, బేటా చిత్రంలో దక్ దక్ కర్నే లగా, చోలీకే పీచే క్యాహై లాంటి పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. డ్యాన్స్, నటనా నైపుణ్యంతో అభిమానులను ఆకర్షించిన ఈ నటి..కొత్త కోణాన్ని బయటకు తీస్తున్నారు. ఇప్పటికే కొన్ని సందర్భాల్లో పాటలను కూడ పాడింది. ఇటీవలే ఇంటి కుటుంబసభ్యులు అందరూ కలిసిన సందర్భంగా మాధురీ..గిటార్ వాయిస్తూ..పాట పాడింది.
దీనికి సంబంధించిన ఓ వీడియోను ఇన్ స్ట్రాగ్రామ్‌లో పోస్టు చేశారు మాధురీ. భర్త శ్రీరామ్ మాధవ్, సంగీతకారుడు జాక్ డిసౌజాతో కలిసి గిటార్ వాయిస్తూ..ఒక పాట పాడడం జరిగిందని మాధురీ తెలిపారు. ఇలా చేయడం సరదాగా ఉందని పోస్టులో తెలిపారు. దీనిని అందరూ అలరిస్తారని వెల్లడించారు మాధురీ.
Read More : ఆ విషయంలో బాధగా ఉంటుంది.. స్టార్ హీరో కొడుకుపై తాప్సీ కామెంట్స్
మాధురీ దీక్షిత్ వివాహం చేసుకున్న తర్వాత బుల్లితెరపై కనిపించి అలరించారు. 1984లో అబోధ్ మూవీతో సినిమాల్లోకి వచ్చారు. తన నటన, అందం డ్యాన్స్‌తో బాలీవుడ్‌లో పాపులర్ నటిగా పేరొందారు. మాధురీ యాక్టర్ చేసిన సినిమాల్లో 80 శాతం బాక్సాపీస్ హిట్సే. పుకార్, లజ్జ వంటి సినిమాల్లో అసమానమైన నటను ప్రదర్శించింది. 2002 నుంచి 2007 వరకు సినిమాలకు దూరంగా ఉన్నారు. 2007లో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆరుసార్లు ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు వరించింది. యూత్‌కు డ్రీమ్ లేడీగా ఉన్నారు మాధురీ.