Vishal : విశాల్ కి షాక్ ఇచ్చిన హైకోర్టు.. వడ్డీతో కలిపి అన్ని కోట్లు కట్టాల్సిందే..
విశాల్ - లైకా కేసు కోర్టులో నడుస్తుంది.

Madras High Court Issues Orders to Vishal in Lyca Productions Case
Vishal : హీరో విశాల్, తమిళ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ హౌస్ కి ఎప్పట్నుంచో డబ్బు లావాదేవీల విషయంలో విబేధాలు ఉన్న సంగతి తెలిసిందే. గతంలో విశాల్ లైకా అనుబంధ సంస్థ దగ్గర ఒక సినిమా నిర్మాణం కోసం 21.29 కోట్లు అప్పు తీసుకున్నాడు. ఆ అప్పు తిరిగి ఇచ్చేదాకా విశాల్ నిర్మించే ఆ సినిమా హక్కులు మావే అని లైకా అగ్రిమెంట్ రాయించుకుంది. కానీ విశాల్ ఆ అగ్రిమెంట్ బ్రేక్ చేసి ఒక సినిమా హక్కులు వేరే సంస్థకు ఇచ్చాడు.
Also Read : Lavanya Tripathi : పెంపుడు కుక్క చనిపోవడంతో.. మెగా కోడలు ఎమోషనల్ పోస్ట్..
అప్పట్నుంచి విశాల్ – లైకా కేసు కోర్టులో నడుస్తుంది. గతంలో విశాల్ వెంటనే 15 కోట్లు కట్టాలని కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చింది. కానీ విశాల్ డబ్బులు లేవంటూ కట్టలేదు. ఆ కేసు రెండేళ్లుగా సాగగా తాజాగా మద్రాస్ హైకోర్టు విశాల్ లైకా ప్రొడక్షన్ వాళ్లకు తీసుకున్న 21.29 కోట్లతో పాటు 30 శాతం వడ్డీ, ఆ నిర్మాణ సంస్థకు అయిన కోర్టు ఖర్చులు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. మరి దీనిపై విశాల్ స్పందిస్తాడా, డబ్బులు కడతాడా చూడాలి.