Maha Samudram Trailer : మన జాతకాన్ని దేవుడు మందు కొట్టి రాసుండాలి..

సిద్ధార్థ్‌, శర్వానంద్‌ హీరోలుగా ‘ఆర్ఎక్స్‌ 100’ ఫేం అజయ్‌ భూపతి దర్శకత్వంలో వస్తున్న ‘మహా సముద్రం’ ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచేసింది..

Maha Samudram Trailer : మన జాతకాన్ని దేవుడు మందు కొట్టి రాసుండాలి..

Maha Samudram Trailer

Updated On : September 23, 2021 / 6:33 PM IST

Maha Samudram Trailer: సిద్ధార్థ్‌, శర్వానంద్‌ హీరోలుగా ‘ఆర్ఎక్స్‌ 100’ ఫేం అజయ్‌ భూపతి దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం.. ‘మహా సముద్రం’.. లవ్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో అదితి రావు హైదరి, అను ఇమ్మానుయేల్ కథానాయికలు..
ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోలు ఆకట్టుకున్నాయి.

Nikhil Vijayendra Simha : బర్త్‌డే పార్టీలో రచ్చ చేశారుగా..!

గురువారం ‘మహా సముద్రం’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే అజయ్ భూపతి ‘ఆర్ఎక్స్ 100’ లాంటి సాలిడ్ హిట్ కొట్టబోతున్నాడనిపించేలా ఉంది ట్రైలర్. సిద్ధార్థ్, శర్వానంద్ ల మేకోవర్ దగ్గరినుంచి మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీ అదిరిపోయాయి. గూని బాబ్జీగా రావు రమేష్ తన స్టైల్‌లో అలరించారు. రాజ్ తోట విజువల్స్, చేతన్ భరద్వాజ్ ఆర్ఆర్ హైలెట్ అయ్యాయి. ఇక అజయ్ రాసిన డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి..

Evaru Meelo Koteeswarulu : ‘చారి’ కోసం ‘గురువు గారు’..!

‘‘సముద్రం చాలా గొప్పది మావా.. అన్ని రహస్యాలూ తనలో దాచుకుంటుంది’’.. ‘‘ఇక్కడ మనం బతకాలంటే.. మన జాతకాన్ని దేవుడు మందు కొట్టి రాసుండాలి’’.. ‘‘నువ్వు సముద్రం లాంటి వాడివి అర్జున్.. నీలో కలవాలని అన్ని నదులూ కోరుకుంటాయ్’’.. వంటి మాటలతో అజయ్ తన పెన్ పవర్ చూపించబోతున్నాడు. అక్టోబర్ 14న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది..