మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్నా ఫ్యాన్స్!

  • Published By: veegamteam ,Published On : April 27, 2019 / 06:10 AM IST
మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్నా ఫ్యాన్స్!

Updated On : May 28, 2020 / 3:40 PM IST

మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మహేశ్ బాబు ఫ్యాన్స్ ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నారో..అంతే ఆతృతగా మరో ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. మరి ఆ ఇద్దరు హీరోలు ఎవరు..? ఒకే వేదిక మీద ముగ్గురు మిత్రులు కలుస్తారా లేదా..? 
Also Read : ఆరంభమేలే.. ఆంథెమ్ ఆఫ్ జెర్సీ : లిరికల్ వీడియో

హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మహేశ్ తన మిత్రులు ఎన్టీఆర్, రామ్ చరణ్ ని ముఖ్య అతిథులుగా పిలిచినట్లు తెలుస్తోంది. టాలివుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు మహేశ్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ ముగ్గురూ మంచి మిత్రులు. ప్రొఫెషనల్ లైఫ్ లో పోటీ ఉన్నా బయిట మాత్రం బర్త్ డే పార్టీలు ఫారెన్ ట్రిప్స్ చివరికి ప్రమోషనల్ ఈవెంట్స్ లో కూడా కలిసి పాల్గొంటారు. 

ఇక మే 1న జరగబోయే మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ ముగ్గురు మిత్రులు ఒకే వేదిక మీద సందడి చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. అంతేకాదు ప్రొడ్యూసర్ దిల్ రాజు చరణ్ ని ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్పెషల్ గా ఇన్వైట్ చేసినట్లు సమాచారం. మరోవైపు ఎన్టీఆర్ కి కూడా మహేశ్ తో మంచి బాండింగ్ ఉంది. సో తప్పకుండా ఈవెంట్ కి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఈ ముగ్గురు మిత్రులు ఒకే వేదిక మీద కనిపిస్తే ఫ్యాన్స్ కి నిజంగా కనువిందే. అందుకే మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మహేశ్ తో పాటుగా తారక్, చరణ్ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read : నిప్పుల కొలిమి : వరల్డ్ 15 హాటెస్ట్ నగరాలు భారత్‌లోనే