ఆరంభమేలే.. ఆంథెమ్ ఆఫ్ జెర్సీ : లిరికల్ వీడియో

రీసెంట్‌గా జెర్సీ నుండి, 'ఆరంభమేలే'.. అనే లిరికల్ వీడియో రిలీజ్ చేసారు. 'ఆంథెమ్ ఆఫ్ జెర్సీ' పేరిట విడుదల చేసిన ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తుంది..

  • Published By: sekhar ,Published On : April 27, 2019 / 06:10 AM IST
ఆరంభమేలే.. ఆంథెమ్ ఆఫ్ జెర్సీ : లిరికల్ వీడియో

రీసెంట్‌గా జెర్సీ నుండి, ‘ఆరంభమేలే’.. అనే లిరికల్ వీడియో రిలీజ్ చేసారు. ‘ఆంథెమ్ ఆఫ్ జెర్సీ’ పేరిట విడుదల చేసిన ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తుంది..

నేచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాధ్ జంటగా, మళ్ళీ రావా ఫేమ్.. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో రూపొందిన పిరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా జెర్సీ.. ఏప్రిల్ 19 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మార్నింగ్ షో నుండే మౌత్ టాక్‌తో, హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతుంది.
Also Read : నాగ్ : అన్నం తింటున్నాడా, అందం తింటున్నాడా?

అన్ని ఏరియాల నుండి పాజిటివ్ టాక్ దక్కించుకోవడమే కాక, నాని నటనకు మంచి మార్కులు పడ్డాయి. తండ్రీ, కొడుకుల సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్ వంటి వాటికి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ప్రస్తుతం రెండవ వారంలోకి ఎంటర్ అయ్యింది జెర్సీ.

ఈ మూవీ నాని కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోతుందని ట్రేడ్ వర్గాలవారు అంటున్నారు. రీసెంట్‌గా జెర్సీ నుండి, ‘ఆరంభమేలే’.. అనే లిరికల్ వీడియో రిలీజ్ చేసారు. ‘ఆంథెమ్ ఆఫ్ జెర్సీ’ పేరిట విడుదల చేసిన ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఈ సాంగ్‌కి కృష్ణకాంత్ లిరిక్స్ రాయగా, అనిరుధ్ అండ్ శ్రీనిధి వెంకటేష్ పాడారు. నాని ప్రస్తుతం మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘గ్యాంగ్ లీడర్’, మరియు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు.
Also Read : తెలుగు, తమిళ్ లో రకుల్ కి తగ్గుతోన్న అవకాశాలు