Ranabaali First Review : విజయ్ దేవరకొండ ‘రణబాలి’ సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్ ఎంతంటే?
Ranabaali First Review : విజయ్ దేవరకొండ మచ్ అవెయిటెడ్ పాన్ ఇండియా సినిమా రణబాలి సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.
Ranabaali movie censor Talk and first Review
Ranabaali First Review : విజయ్ దేవరకొండ మచ్ అవెయిటెడ్ పాన్ ఇండియా సినిమా రణబాలి సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది. రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కించిన భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఎలాంటి కట్స్ లేకుండా U/A సర్టిఫికేట్ సొంతం చేసుకుంది. చరిత్రని కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేసిన డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్.. హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది.
ఇక శింగనమల బొబ్బిలి రణబాలిగా విజయ్ దేవరకొండ ఫెరోషియస్ పర్ఫార్మెన్స్కి.. గూస్బంప్స్ గ్యారెంటీ అనేలా ఉంది సెన్సార్ రిపోర్ట్. 2గంటల 50నిమిషాల డ్యూరేషన్ లాక్ చేసుకుని అక్టోబర్ 16న ఆడియెన్స్ ముందుకొచ్చేందుకు సిద్ధమైంది రణబాలి.
Read Also – Pooja Hegde : బుట్టబొమ్మ బర్త్ డే.. స్పెషల్ ఫోటోలను షేర్ చేసిన పూజా హెగ్డే..
రణబాలి సినిమా విజయ్ దేవరకొండ కంబ్యాక్ సినిమా అవుతుందనే అంచనాలతో ఉన్నారు అభిమానులు. దీంతో రణబాలిని ఎంతో చాలెంజింగ్‌గా తీసుకున్న విజయ్ దేవరకొండ.. ఈ సినిమా కోసం ప్రాణం పెట్టారనే చెప్పాలి. కఠినమైన యాక్షన్ సీన్స్‌తో పాటు గుర్రపు స్వారీలు సహా ఫిజికల్‌గా ఎంతగానో హార్డ్‌వర్క్ చేశారు.
కెరీర్లో ఫస్ట్‌టైమ్ రూరల్ బ్యాక్‌డ్రాప్ పీరియాడిక్ యాక్షన్ సినిమా కోసం సరికొత్తగా మేకోవర్ అయ్యారు. అటు రష్మిక మందానతో మూడో సినిమా ఇటు టాక్సీవాలా హిట్ ఇచ్చిన డైరెక్టర్ ఈ కాంబినేషన్లో వస్తోన్న రణబాలి సినిమా నైజాం బుకింగ్స్ మొదలయినట్లు అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
బ్రిటీష్ పాలకుల అరాచకాలు, దౌర్జన్యాలు, 1854–78 మధ్య రాయలసీమ కరువు పరిస్థితులు, ఆనాటి ప్రజల ఆకలి బాధలు, బ్రిటీష్ సర్కార్ అన్యాయపు పన్నులు, ఈ నేపథ్యంలో రణబాలి కథ ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే వీటన్నింటికి ఎదురునిలిచిన యోధుడిగా విజయ్ దేవరకొండ రణబాలి పాత్రలో మెస్మరైజ్ చేసేందుకు వస్తున్నారు.
Read Also – BharataVarsha : ఆకట్టుకుంటున్న ‘అమ్మ కదిలి వచ్చె’ సాంగ్.. గోపిచంద్ ‘భరతవర్ష’ మూవీ నుంచి..
కచ్చితంగా రణబాలి తెలుగు సినిమా గర్వపడేలా ఉంటుందని.. కంబ్యాక్ పరంగానూ రౌడీ హీరో విజయ్ దేవరకొండకి నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే రేంజ్లో బ్లాక్ బాస్టర్ అవుతుందనే కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు మేకర్స్. మరి ఆడియెన్స్ అంచాలని అందుకుని రణబాలి.. బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వెయిట్ అండ్ సీ.
