Mahesh Babu : ‘మేము ఫేమస్’ చూసిన మహేష్.. నెక్స్ట్ సినిమా ప్రొడ్యూస్ చేస్తానంటూ ట్వీట్.. సుమంత్ ప్రభాస్ మాములు లక్ కాదుగా..
మేము ఫేమస్ చిత్రయూనిట్ డిఫరెంట్ గా ప్రమోషన్స్ చేస్తూ అందర్నీ ఆకర్షిస్తున్నారు. వీళ్ళ ప్రమోషన్స్ చూసి అంతా వీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు. చిన్న సినిమా అయినా చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ నిర్మిస్తుండటంతో పెద్ద పెద్ద స్టార్స్ ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.
Memu Famous : ఇటీవల కొన్ని చిన్న చిన్న సినిమాలు మంచి విజయం సాధిస్తున్నాయి. కొత్త దర్శకులు మంచి సినిమాలతో వచ్చి హిట్స్ కొడుతున్నారు. యూట్యూబర్ సుమంత్ ప్రభాస్(Sumanth Prabhas) హీరోగా, దర్శకుడిగా తెరకెక్కిన సినిమా మేము ఫేమస్. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. తెలంగాణ నేటివిటీలో వస్తుండటంతో ముఖ్యంగా తెలంగాణ(Telangana)లో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.
మేము ఫేమస్ చిత్రయూనిట్ డిఫరెంట్ గా ప్రమోషన్స్ చేస్తూ అందర్నీ ఆకర్షిస్తున్నారు. వీళ్ళ ప్రమోషన్స్ చూసి అంతా వీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు. చిన్న సినిమా అయినా చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ నిర్మిస్తుండటంతో పెద్ద పెద్ద స్టార్స్ ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఇప్పటికే చాలామంది హీరోలు, హీరోయిన్స్, డైరెక్టర్స్, యాక్టర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ లో ఏదో ఒక రకంగా భాగం అవుతున్నారు. మే 26న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.
ఇప్పటికే ఈ సినిమాను కొంతమంది ప్రముఖులు చూసి అభినందిస్తున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మేము ఫేమస్ సినిమా చూసి ట్విట్టర్ లో ఈ సినిమాని అభినందిస్తూ ట్వీట్ చేశారు. మహేష్ తన ట్వీట్ లో..ఇప్పుడే మేము ఫేమస్ సినిమా చూశాను. సినిమాలో ప్రతి ఒక్కరు తమ ట్యాలెంట్ తో మెప్పించారు. ముఖ్యంగా హీరో, రైటర్, డైరెక్టర్ సుమంత్ ప్రభాస్ అద్భుతమైన ట్యాలెంట్. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఇంతమంది కొత్తవాళ్లతో మంచి సినిమా తీశారు. నిర్మాతలు శరత్, అనురాగ్ లకు అభినందనలు ఇలాంటి కొత్త ట్యాలెంట్ ని ప్రోత్సహిస్తున్నందుకు అని ట్వీట్ చేశారు.
Love Today : లవ్‌టుడే హిందీ రీమేక్.. అమీర్ ఖాన్ తనయుడితో జాన్వీ కపూర్ చెల్లెలు రొమాన్స్?
అయితే మహేష్ చేసిన ట్వీట్ కి నిర్మాత శరత్ థ్యాంక్స్ చెప్తూ ట్వీట్ చేసి.. సుమంత్ ప్రభాస్ తో మరో సినిమా చేస్తున్నాం, ఈ సినిమాకు మీరు ప్రొడ్యూస్ చేస్తారా అని అడగడంతో మహేష్ ఆ ట్వీట్ కి రిప్లై ఇస్తూ.. కచ్చితంగా చేస్తాను, GMB ఎంటర్టైన్మెంట్ ఇలాంటి కొత్త ట్యాలెంట్ ఎంకరేజ్ చేయడంలో హ్యాపీగా ఉంటుంది అని ట్వీట్ చేశారు. దీంతో సుమంత్ ప్రభాస్ సినిమా రిలిజ్ అవ్వకుండానే మహేష్ బాబు నిర్మాణంలో సినిమా ఛాన్స్ పట్టేశాడు అని అందరూ అభినందిస్తున్నారు. గతంలో చాయ్ బిస్కెట్ నిర్మాతలు, మహేష్ బాబు కలిసి అడివి శేష్ హీరోగా మేజర్ సినిమాని తెరకెక్కించారు.
Just watched #MemFamous! Brilliant film!! ❤️❤️
Blown away by the performances of each and every actor in the film, especially writer, director and actor @SumanthPrabha_s – what a talent!
The visuals, background score and all the crafts sit perfectly. Can’t believe a bunch of…
— Mahesh Babu (@urstrulyMahesh) May 25, 2023
Done @SharathWhat! @GMBents will be more than happy to back this young talent! 😊 https://t.co/9Go4EaKgCI
— Mahesh Babu (@urstrulyMahesh) May 25, 2023