Mahesh Babu: జక్కన్న కోసం మహేష్ పూర్తి ఫోకస్‌గా ఉన్నాడు – సుధీర్ బాబు!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఆస్కార్ నామినేషన్స్‌లో నిలవడంతో, ఇప్పుడు ప్రపంచ సినీ లవర్స్ చూపు జక్కన్నపై పడింది. ఇక ఈ డైరెక్టర్‌తో ఒక్క సినిమా అయినా చేయాలని పలువురు స్టార్ నటీనటులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కాగా, జక్కన్న తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
Mahesh Babu: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఆస్కార్ నామినేషన్స్‌లో నిలవడంతో, ఇప్పుడు ప్రపంచ సినీ లవర్స్ చూపు జక్కన్నపై పడింది. ఇక ఈ డైరెక్టర్‌తో ఒక్క సినిమా అయినా చేయాలని పలువురు స్టార్ నటీనటులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కాగా, జక్కన్న తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
Mahesh Babu : మళ్ళీ వెకేషన్‌కి వెళుతున్న మహేష్.. SSMB28 షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడు?
దీంతో ప్రేక్షకులు ఈ ప్రాజెక్ట్ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి యంగ్ హీరో సుధీర్ బాబు తాజాగా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. సుధీర్ బాబు నటించిన ‘హంట్’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రాజమౌళి-మహేష్ బాబు మూవీ గురించి కొన్ని కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో పూర్తి ఫోకస్‌తో ఉన్న హీరో మహేష్ బాబు అని సుధీర్ బాబు తెలిపాడు. రాజమౌళితో సినిమా అనౌన్స్ చేసిన తరువాత మహేష్ అన్ని విధాలుగా రెడీగా ఉండేలా చూసుకుంటున్నాడట.
రాజమౌళి ఎప్పుడు వచ్చి ఏదైనా చేయమంటే, చేసేందుకు రెడీగా ఉండాలని మహేష్ తన ఫోకస్ మొత్తం ఈ సినిమాపై పెట్టినట్లుగా సుధీర్ బాబు తెలిపాడు. అటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మూవీని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మహేష్ భావిస్తున్నాడట. ఇక రాజమౌళి మూవీ కోసం మహేష్ ఇప్పట్నుంచే రెడీ అవుతుండటం నిజంగా గ్రేట్ అంటూ సుధీర్ బాబు చెప్పుకొచ్చాడు. ఏదేమైనా మహేష్‌ను తాను ఇంత ఫోకస్‌గా ఎప్పుడూ చూడలేదని సుధీర్ బాబు తెలిపాడు.